Aamir Khan: రజనీతో స్క్రీన్ షేర్ చేసుకోవడమే కోట్లతో సమానం..
ABN , Publish Date - Aug 16 , 2025 | 06:27 PM
రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కూలీ’.ఈ చిత్రంలో ఆమిర్‌ఖాన్ దాహా అనే పాత్రలో నటించారు. ఆమిర్‌ఖాన్ ఏకంగా రూ.20 కోట్లు తీసుకున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై అయన క్లారిటీ ఇచ్చారు
రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కూలీ’. (coolie). నాగార్జున్, ఉపేంద్ర, ఆమిర్‌ఖాన్(Aamir Khan) కీలక పాత్రధారులుగా నటించారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాలో నాగార్జున, ఆమిర్‌ఖాన్ పాత్రలు కీలకంగా సాగాయి. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి వీరిద్దరి పారితోషికం గురించి చర్చ నడుస్తూనే ఉంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆమిర్‌ఖాన్ దాహా అనే పాత్రలో నటించారు. విడుదలైన మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.151కోట్లు వసూళ్లు చేసినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. మెయిన్‌గా ఆమిర్‌ఖాన్ ఏకంగా రూ.20 కోట్లు తీసుకున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై ఆయన టీమ్ స్పందించినా ఫుల్‌స్టాప్ పడలేదు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమిర్‌ఖాన్ తన రెమ్యునరేషన్ గురించి క్లారిటీ ఇచ్చారు. అసలు రజనీ సర్‌తో స్క్రీన్ పంచుకోవడమే నాకు కోట్ల రూపాయలతో సమానం. దాని కన్నా విలువైనది ఏదీ లేదు’ అని అన్నారు. (Aamir Khan Remunaration)
ఆయన మాట్లాడుతూ ‘కూలీ’ కోసం నేను రూపాయి కూడా తీసుకోలేదు. రజనీకాంత్‌పై నాకు ఉన్న ప్రేమ, అభిమానానికి వెలకట్టలేరు. ఆయనతో కలిసి తెరపై కనిపించడమే నాకు పెద్ద రివార్డు. ఇందులో నేను అతిథి పాత్రలో మాత్రమే కనిపించాను. రజనీకాంత్, నాగార్జున ఇందులో అసలైన హీరోలు. ‘కూలీ’ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఈ స్థాయిలో ఆసక్తి చూపిస్తున్నారంటే అది వారిని చూసేందుకే.. నా కోసం కాదు’’ అని అన్నారు. ఆమిర్ ఇచ్చిఇన క్లారిటీతో రెమ్యునరేషన్ వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది.
ALSO READ:
Hearty Singh: ఈ పిల్లాడు ఎవరో గుర్తు పట్టారా... వార్ 2లో ఆ పాత్ర ...
OG Movie: 'ఓజీ'.. ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది