Anjali New Movie: లేడీ ఓరియెంటెడ్ మూవీలో అంజలి

ABN , Publish Date - Aug 08 , 2025 | 03:34 PM

హీరోయిన్లు రూట్ మారుస్తున్నారు. గ్లామర్ ట్రీట్ కు గుడ్ బై చెప్పి యాక్షన్ లోకి దిగుతున్నారు. ఒకరి తర్వాత మరొకరు అదే బాటపడుతున్నారు. ఇన్నాళ్లు కుర్రాళ్ల క్రష్ గా మారిన బ్యూటీలు రౌడీ బేబీస్ గా మారుతున్నారు.

హీరోయిన్లు నయా ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. అందాల ఆరబోత కంటే రఫ్పాడించే క్యారెక్టర్లకు జై కొడుతున్నారు. ఇన్నాళ్లు పాటలతో ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేసిన బ్యూటీలు... ఇక లేడీ ఓరియెంటెడ్ మూవీస్ పై మనసు పారేసుకుంటున్నారు. యాక్షన్ బాట పడటంతో పాటు సమస్యలపై పోరాడేందుకు వచ్చేస్తున్నారు. మాములుగా లేడీ ఓరియంటెడ్ సినిమా అంటే ముందుగా గుర్తొచ్చేది అనుష్క శెట్టినే (Anushka Shetty). 'అరుంధతి, పంచాక్షరీ, భాగమతి' వంటి సినిమాలతో ఆడియెన్స్ మనసు దోచుకున్న స్వీటీ... త్వరలో 'ఘాటీ' (Ghaati)తో పలకరించనుంది. అనుష్క తర్వాత నయనతార, సమంత, తమన్నా, అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ సత్తా చాటారు. ఇప్పటికే పలు విమెన్ సెంట్రిక్ సినిమాల్లో నటించిన రాజోలు బ్యూటీ మళ్లీ లేడీ స్పెషల్ సినిమాపై మనసు పారేసుకుంది.


కమర్షియల్ సబ్జెక్ట్ సినిమాల్లో నటిస్తున్నా అప్పుడప్పుడు కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తోంది అంజలి (Anjali ). తాజాగా 9 క్రియేషన్స్ నిర్మాణంలో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల (RajaSekar Reddy Pulicharla) తెరకెక్కిస్తున్న కొత్త మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా హైదరాబాద్ లోని మూవీ ఆఫీస్‌లో గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇప్పటికే దర్శకుడిగా 'సాఫ్ట్ వేర్ సుధీర్, గాలోడు' వంటి సినిమాలతో మంచి మార్కులు కొట్టేశాడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల. ఇప్పుడు అంజలితో లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఆయన శ్రీకారం చుట్టడంతో అప్పుడే అంచనాలు నెలకొన్నాయి.

దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల... అంజలీ కోసం అదిరిపోయే స్టోరీని రెడీ చేశారట. డిఫరెంట్ కాన్పెప్ట్ తో వస్తున్న ఈ మూవీకి రాజచంద్రశేఖర్ రెడ్డి కందుల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సి. రాంప్రసాద్ సినిమాటో గ్రాఫర్ గా పని చేయనున్నారు. త్వరలోనే మిగతా టెక్నిషియన్లతో పాటు నటీనటుల వివరాలను వెల్లడించనున్నారు. ఇక అంజలి విషయానికి వస్తే... 'ఫోటో' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటించి మెప్పించింది. స్పెషల్ సాంగ్స్ లో కూడా సందడి చేసింది. ఆ మధ్య 'గేమ్ ఛేంజర్'లో అద్భుతమైన పాత్రను చేసి అభిమానుల మనసును దోచుకుంది. ఈ యేడాది పొంగల్ కు విడుదలైన విశాల్ 'మదగజరాజ'తో అంజలి సక్సెస్ ను అందుకుంది. ప్రెజెంట్ కమర్షియల్ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి లేడీ ఓరియెంటెండ్ మూవీలో నటించేందుకు రెడీ అయింది. మరీ ఈ మూవీతో అంజలి ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.

Read also : Nishaanchi: అనురాగ్ క‌శ్య‌ప్ కొత్త సినిమా.. టీజ‌ర్ ఇంత బోల్డ్‌గా ఉందేంటి

Read also : Sangeetha: భర్తతో విడాకులు.. క్లారిటీ ఇచ్చిన సంగీత

Updated Date - Aug 08 , 2025 | 03:34 PM

Anjali: అబ్బాయిని చూపించినా.. నమ్మేలా లేరు!

Anjali: ఆ సన్నివేశం చేసేటప్పుడు గందరగోళానికి గురయ్యా!

Anjali: గేమ్ ఛేంజర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. అదేంటో నా సినిమాల‌న్నీ Gతో స్టార్ట్ అవుతున్నాయ్‌

Anjamai: పిల్లల చదువుల కోసం.. తల్లిదండ్రులు ప‌డే కష్టాన్ని చూపాం

Anjali: బాలయ్య నన్ను ఎందుకు నెట్టారో నాకు తెలుసు.. అనవసరంగా పెద్దది చేశారు