Sangeetha: భర్తతో విడాకులు.. క్లారిటీ ఇచ్చిన సంగీత
ABN , Publish Date - Aug 08 , 2025 | 02:06 PM
నటి సంగీత (Sangeetha)గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఖడ్గం సినిమాతో తెలుగువారి గుండెలలో తనకంటూ ఒక ప్రత్యకమైన స్థానాన్ని సంపాదించుకుంది.
Sangeetha: నటి సంగీత (Sangeetha)గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఖడ్గం సినిమాతో తెలుగువారి గుండెలలో తనకంటూ ఒక ప్రత్యకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఆ తరువాత సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక తెలుగులో అవకాశాలు రాకపోయినా.. కొన్ని షోస్ కు జడ్జిగా వ్యవహరిస్తూ కెరీర్ ను కొనసాగించిన సంగీత మసూద సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగీత తెలుగులో పరదా (Paradha) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమాలు విషయం పక్కన పెడితే.. గత కొన్నిరోజులుగా సంగీత తన భర్త క్రిష్ కు విడాకులు ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సంగీత.. కోలీవుడ్ సింగర్ క్రిష్ ను పెళ్లి ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక పాప కూడా ఉంది. 16 ఏళ్లుగా వీరి దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా కొనసాగుతుంది. అయితే ఈమధ్యనే సంగీత తన సోషల్ మీడియా అకౌంట్ లో తన పేరు వెనుక ఉన్న భర్త పేరును తీసేసింది. ఈమధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్ ఐడీ నుంచి భర్త పేరును తొలగిస్తే చాలు విడిపోయినట్లే అని భావిస్తున్నారు.
ఇక సంగీత ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం, సంగీత పేరు వెనుక క్రిష్ అని లేకపోవడంతో వీరు కూడా విడిపోయారని నెట్టింట వార్తలు వైరల్ గా మారాయి. తాజాగా సంగీత తన విడాకుల విషయమై నోరు విప్పింది. తమ మధ్య ఎలా విభేదాలు లేవని, తాము కలిసే ఉంటున్నామని చెప్పుకొచ్చింది. ' నా ఇన్స్టాగ్రామ్ ఐడీ మొదటి నుంచి సంగీత యాక్టర్ అనే ఉంటుంది. నేను మధ్యలో మార్చుకోలేదు. మా ఇద్దరి మధ్య విభేదాలు లేవు. నా భర్తతో నేను చాలా సంతోషంగా ఉన్నాను.మేము విడాకులు తీసుకుంటున్నాం అంటూ వస్తున్న వార్తలు అబద్దాలు' అని చెప్పుకొచ్చింది. దీంతో సంగీత విడాకులు అంటూ వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.
Nishaanchi: అనురాగ్ కశ్యప్ కొత్త సినిమా.. టీజర్ ఇంత బోల్డ్‌గా ఉందేంటి
Jatadhara: సుధీర్‌బాబు జటాధర.. టీజర్ వదిలిన ప్రభాస్