Anjali: అబ్బాయిని చూపించినా.. నమ్మేలా లేరు!

ABN , Publish Date - May 26 , 2024 | 03:48 PM

తెలుగు బ్యూటీ అంజలి (Anajali) తన పెళ్లి గురించి స్పందించింది. ఇప్పటికే ఆమె పెళ్లిపై ఎన్నో రకాల రూమర్లు వచ్చాయి. నదీ ప్రవాహంలా ఈ రూమర్లు వస్తూనే ఉన్నాయి.

Anjali:  అబ్బాయిని చూపించినా.. నమ్మేలా లేరు!

తెలుగు బ్యూటీ అంజలి (Anajali) తన పెళ్లి గురించి స్పందించింది. ఇప్పటికే ఆమె పెళ్లిపై ఎన్నో రకాల రూమర్లు వచ్చాయి. నదీ ప్రవాహంలా ఈ రూమర్లు వస్తూనే ఉన్నాయి. కెరీర్‌ బిగినింగ్‌లో తమిళ హీరో జైతో (Jai)ప్రేమలో ఉందని,  పెళ్లి (Anjali marriage) కూడా చేసుకోబోతోందని టాక్‌ నడిచింది. అంజలి క్లారిటీ ఇవ్వడంతో ఆ రూమర్‌లకు అడ్డుకట్ట పడింది. మళ్లీ సినిమాలతో బిజీ అయిన తర్వాత ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుందని వార్తలొచ్చాయి. దాంతో సినిమాలకు స్వస్తి చెప్పి అమెరికాకి మకాం మార్చేస్తుందని   టాక్‌ నడిచింది. అయితే వీటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది అంజలి. అయినా కూడా మ్యారేజ్‌ రూమర్స్‌ వస్తూనే ఉన్నాయి.

Anjali.jpg

తాజాగా పెళ్లిపై వస్తున్న వదంతులపై అంజలి మాట్లాడారు. ‘ఇప్పటికే సోషల్‌ మీడియా నాకు మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసింది. మొదట్లో ఇలాంటి రూమర్స్‌ వేస్త ఇంట్లో వాళ్లు కంగారు పడేవాళ్లు. కానీ ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆ మధ్య నేను పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్‌ అయ్యాననే టాక్‌ వచ్చింది. అమెరికాలోనే ఉన్న మా అక్క నాకు కాల్‌ చేసి..‘పెళ్లి అయిందటగా’ అని అడిగింది. ఏమో మరి నాకే తెలియదు అని చెప్పా. నా పెళ్లిపై వచ్చిన రూమర్స్‌ కారణంగా.. నేను ఒక అబ్బాయిని తీసుకెళ్లి ఇతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పినా.. ఇంట్లో వాళ్లు నమ్మేలా లేరు. పెళ్లి అయితే కచ్చితంగా చేసుకుంటా. కానీ ఇప్పుడు కాదు. ప్రస్తుతం నేను సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను.  పెళ్లి చేసుకుంటే.. పర్సనల్‌ లైఫ్‌కి కూడా టైమ్‌ కేటాయించాలి. అందుకే కొంచెం టైమ్‌ తీసుకొని పెళ్లి చేసుకుంటా. పెళ్లి తర్వాత కూడా యాక్టింగ్‌ చేస్తా’ అని అంజలి తెలిపింది. ప్రస్తుతం అంజలి నటించిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ విడుదలకు సిద్థమైంది. విశ్వక్‌ సేన్  హీరోగా నటించిన ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. నేహా శెట్టి మరో హీరోయిన్‌.  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మే 31న విడుదల కాబోతుంది.

Updated Date - May 26 , 2024 | 03:48 PM