Anjamai: పిల్లల చదువుల కోసం.. తల్లిదండ్రులు ప‌డే కష్టాన్ని చూపాం

ABN , Publish Date - Jun 03 , 2024 | 08:14 AM

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, తిరుచిత్రం సహకారంతో నిర్మించిన మూవీ ‘అంజామై’. విదార్థ్, వాణి భోజన్, రఘుమాన్‌ కీల‌క పాత్ర‌లు ఈ నెల 7న సినిమా విడుదలకానుంది. దీన్ని పురస్కరించుకుని చిత్రం బృందం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది.

Anjamai: పిల్లల చదువుల కోసం.. తల్లిదండ్రులు ప‌డే కష్టాన్ని చూపాం
Anjamai

అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, తిరుచిత్రం సహకారంతో నిర్మించిన మూవీ ‘అంజామై’(Anjamai). మోహన్‌ రాజా, లింగుస్వామి వంటి స్టార్‌ దర్శకుల వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన ఎస్‌.పి.సుబ్బురామన్‌ దర్శకత్వం వహించారు. విదార్థ్ (vidharth), వాణి భోజన్ (vanibhojan), రఘుమాన్‌, కృతికామోహన్‌, బాలచంద్రన్‌, ఏఏఎస్‌ వంటి పలువురు నటీనటులు కీల‌క పాత్ర‌లు నటించారు. కార్తీక్‌ ఛాయాగ్రహణం, రాఘవ్‌ ప్రసాద్‌ సంగీత స్వరాలు సమకూర్చగా, కలా చరణ్‌ నేపథ్య సంగీతం అందించారు. ఈ నెల 7న సినిమా విడుదలకానుంది. దీన్ని పురస్కరించుకుని చిత్రం బృందం చెన్నైలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

Image00001-3.jpg

ఈ సంద‌ర్భంగా చిత్ర దర్శకుడు సుబ్బురామన్‌ మాట్లాడుతూ.. ‘ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన తిరునావుక్కరసు కేవలం వైద్యుడు మాత్రమే కాదు మనో వైద్యుడు. ప్రొఫెసర్‌, రచయిత, వక్త, సామాజిక ఆలోచనాపరుడు, తమిళ ఉద్యమకారుడు ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి. అలాంటి వ్యక్తి నుంచి నేను పాస్‌ మార్కులు వేయించుకోవడం చాలా సంతోషంగా ఉంది. డ్రీమ్‌ వారియర్స్‌ సంస్థలో ఒక చిత్రం చేయాలన్న కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. వారు ఒక కథను సామాన్యంగా అంగీకరించరు. ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఆ సంస్థ అధిపతులు ముందుకు రావడం తొలి విజయం. అధికారంలో ఉన్నవాడు సామాన్యుడిని ఎలా ప్రభావితం చేస్తాడు. అలా ప్రభావితమైన ఓ వ్యక్తి కథే ఈ చిత్ర స్టోరీ.


తమ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఎంతలా కష్టపడుతున్నారనే విషయాన్ని చెప్పాం. ఇలా నేటి సమాజంలో జరుగుతున్న అనేక విషయాలను వెండితెరపై చూపించాం’ అన్నారు. నటుడు విదార్థ్ (vidharth) మాట్లాడుతూ... ‘ఇలాంటి ఒక మంచి చిత్రంలో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. నాలుగు కాలాల్లో జరిగే కథ. దిండిగల్‌లో షూటింగ్‌ పూర్తి చేశాం. ఒక పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటించాల్సి ఉంది. ఆయన కాల్షీట్‌ లభించక పోవడంతో రఘుమాన్‌ను ఎంపిక చేశాం. నిర్మాణం పూర్తయిన తర్వాత డ్రీమ్‌ వారియర్‌ నిర్మాతలు చూసి ఈ సినిమాను సొంతం చేసుకున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు తెరకెక్కించారు’ అన్నారు.

Updated Date - Jun 03 , 2024 | 08:17 AM