Nishaanchi: అనురాగ్ క‌శ్య‌ప్ కొత్త సినిమా.. టీజ‌ర్ ఇంత బోల్డ్‌గా ఉందేంటి

ABN , Publish Date - Aug 08 , 2025 | 01:17 PM

బాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ రెండేండ్ల విరామం త‌ర్వాత ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం నిషాంచి.

Nishaanchi

బాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ (Anurag Kashyap) రెండేండ్ల విరామం త‌ర్వాత ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం నిషాంచి (Nishaanchi). అమెజాన్ ఎమ్జీఎమ్ స్టూడియో (Amazon MGM Studios)తో క‌లిసి, JAR పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై (JAR Pictures) రంజ‌న్ సింగ్‌, అజ‌య్ రాయ్ నిర్మించారు. ఐశ్వరీ ఠాక్రే (Aaishvary Thackeray ) హీరోగా ఎంట్రీ ఇస్తుండ‌గా అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్‌ల‌తో మంచి గుర్తింపును ద‌క్కించుకున్న మోనిక ప‌న్వార్ (Monika Panwar), వేదిక పింటో (Vedika Pinto) క‌థానాయిక‌లు. వినీత్ కుమార్ సింగ్ (Vineet Kumar Singh), కుముద్ మాశ్రా, జీష‌న్ అయుబ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌గా యూ ట్యూబ్‌లో పెద్ద ర‌చ్చే చేస్తోంది.

పూర్తిగా యూపీ, బీహార్ ప్రాంత ప్ర‌జ‌ల శైలిలో నాటుగా ఈ సినిమాను రూపొందించ‌న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ప్ర‌తీ సీన్‌లో అక్క‌డి ప్రాంతం త‌ర‌హా ర‌ఫ్ డైలాగులు, చేష్ట‌లు, తుఫాకుల వాడకం రియ‌ల్‌గా షూట్ చేశారా అనేలా ఉంది. అంతేగాక ఇంటిమేట్, ముద్దు స‌న్నివేశాలు సైతం చాలా ర‌స్టిక్‌గా తెర‌కెక్కించిన‌ట్లు స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఈ వీడియో చూసొన వాళ్లు ఇదే ఎంట్రీ టీజ‌ర్‌ ఇలా ఉంటే ఆ త‌ర్వాత వ‌చ్చే ట్రైల‌రు, ఆపైన సినిమా ఇంక ఎంత బోల్డ్‌గా తీసి ఉంటార‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ నిషాంచి (Nishaanchi) చిత్రాన్నిసెప్టెంబ‌ర్ 19న ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి తీసుకు వ‌స్తున్న‌ట్లు మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. మీరూ ఈ టీజ‌ర్‌పై ఓ లుక్కేయండి మ‌రి.


Also Read... ఇవి కూడా చ‌ద‌వండి

Nadikar OTT: ఏడాది త‌ర్వాత ఓటీటీకి.. మ‌ల‌యాళ స్టార్ సినిమా! తెలుగులోనూ

Oho Enthan Baby OTT: అదిరిపోయే రొమాంటిక్ ల‌వ్‌స్టోరి.. తెలుగులోనూ ఓటీటీకి వ‌చ్చేసింది

Mahavatar Narsimha: ఓం న‌మో భ‌గ‌వ‌తే వాసుదేవాయ పాటొచ్చేసింది.. ఇక భ‌క్తి త‌న్మ‌య‌త్వంలో మునిగి తేలండి

Kingdom:‘కింగ్డమ్‌’.. థియేట‌ర్ల‌కు ర‌క్ష‌ణ కల్పించండి! హైకోర్టులో పిటిషన్

Theater Movies: ఈ శుక్ర‌వారం.. ఇండియా వైడ్ థియేట‌ర్ల‌కు వ‌స్తున్న సినిమాలివే! స‌గం హ‌ర్ర‌ర్ మూవీసే

Nandamuri Balakrishna: 'అఖండ-2' డబ్బింగ్ పూర్తి

Updated Date - Aug 08 , 2025 | 01:19 PM