Anasuya Fire: మీ తల్లినో.. చెల్లినో అలా అంటే ఊరుకుంటారా. అనసూయ ఫైర్‌

ABN , Publish Date - Aug 03 , 2025 | 04:21 PM

హాట్‌ యాంకర్‌, నటి అనసూయ 'చెప్పు తెగుద్ది' అంటూ మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. వేదిక ముందు కొందరు యువత అసభ్యకర కామెంట్స్‌ చేయడంతో అవి ఆమె చెవిన పడ్డాయి.

Anasuya

హాట్‌ యాంకర్‌, నటి అనసూయ (Anasuya) 'చెప్పు తెగుద్ది' అంటూ మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. వేదిక ముందు కొందరు యువత అసభ్యకర కామెంట్స్‌ చేయడంతో అవి ఆమె చెవిన పడ్డాయి. దాంతో ఒక్కసారిగా ఫైర్‌ అయింది అనసూయ. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అసలు విషయం ఏంటంటే.. ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో ఓ షాపింగ్‌ మాల్‌ ప్రారంభించడానికి అనసూయ వెళ్లారు. ఆమె స్టేజీపై మాట్లాడుతుండగా కింద ఉన్న జనంలో కొందరు ఆకతాయిలు ఆమెపై కొన్ని కామెంట్స్‌ చేశారు. దీంతో అనసూయ కోపంతో ఊగిపోయింది. చెప్పు తెగుద్ది. కామెంట్‌ చేసిన వాడిని కిందకి వచ్చి కొట్టడానికి కూడా వెనకాడను. మీ ఇంట్లో ఉండే తల్లి, అక్క, చెల్లి, కాబోయే భార్య, గర్ల్‌ ఫ్రెండ్స్‌ను ఇలాగే కామెంట్స్‌ చేస్తారా? ఎవరన్నా అలా చేస్తే ఊరుకుంటారా? చాలా తప్పు ఇది. ఇలాంటి వారికి ఇక్కడ ఉంచొద్దు. ఇక్కడి నుంచి పంపించేయండి’ అంటూ సదరు ఆకతాయిలపై ఫైర్‌ అయింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ తిరుగుతుంది. (Anasuya Mass Warning)

ALSO READ: Krishna Master: రేప్‌ కేసు.. ఢీ, బీబీ జోడి డాన్స్ మాస్టర్‌ కృష్ణ అరెస్ట్

యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించిన అనసూయ తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ తెచ్చుకుంది. నటిగానూ మంచి పాత్రలు చేస్తూ అలరిస్తోంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తరచూ వివాదాల్లోనూ నిలుస్తుంటారు.

ALSO READ: Allu Aravind: ప‌వ‌న్ క‌ల్యాణ్.. మహావతార్ న‌ర‌సింహా చూడాలి

Ojas Gambheera: నాలుగు నిమిషాల పాట.. ఫ్యాన్‌ బోయ్‌ చాలానే చెప్పాడు..

Rajinikanth: రెండు రూపాయలు ఇచ్చి.. బాధ కలిగించేలా మాట్లాడాడు..

Updated Date - Aug 03 , 2025 | 07:00 PM