Mahakali: అసుర గురువు శుక్లాచార్యుడిగా.. బాలీవుడ్ నటుడు
ABN, Publish Date - Sep 30 , 2025 | 03:13 PM
దర్శకుడు ప్రశాంత్‌వర్మ (Prasanth Varma) సినిమాటిక్ యూనివర్స్ నుంచి వరుస ప్రాజెక్ట్‌లు తీసుకురానున్నారు.
దర్శకుడు ప్రశాంత్‌వర్మ (Prasanth Varma) సినిమాటిక్ యూనివర్స్ నుంచి వరుస ప్రాజెక్ట్‌లు తీసుకురానున్నారు. ఇందులో భాగంగా రానున్న మూడో సినిమా ‘మహాకాళి’ (Mahakali) . ఫీమేల్ సూపర్ హీరో చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రశాంత్ వర్మ కథ అందిస్తుండగా.. పూజ అపర్ణ కొల్లూరు (Aparna Kolluru) దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను ప్రశాంత్ వర్మ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఇందులో అసురు గురువు శుక్లాచార్యుడిగా బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా (Akshaye Khanna) నటించనున్నట్లు ప్రశాంత్ వర్మ తెలిపారు.
‘దేవతల నీడలో కాంతివంతమైన తిరుగుబాటు జ్వాలగా ఎదిగిన శుక్రాచార్యుడు’ అంటూ ఓ పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ సినిమా గురించి ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ‘మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్థం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్ హీరోలు ఎలా ఉంటారో ఈ సినిమాలో చూపించనున్నాం’ అని తెలిపారు.
హనుమాన్ సక్సెస్ సీక్రెట్.. మైథాలజీని సోషల్ డ్రామాకి మిక్స్ చేయడంతో ఈ సినిమాకి పాన్ ఇండియా హైప్ వచ్చింది. పురాణాలతో పరిచయం ఉన్న అందరికీ ఆ సబ్జెక్ట్ బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు మహాకాళితో శుక్రాచార్యుడిని తీసుకొచ్చారు. శుక్రాచార్యుడు అసురుల గురువు, భృగువు మహర్షి కుమారుడు. మృతసంజీవని మంత్రం తెలిసినవాడు. మహాభారతంలో శుక్రాచార్యుడి ప్రభావం ఉంది. అసురులకు ఆయన ఇచ్చిన విద్య, శక్తులు తరువాతి తరాలకు కూడా సహాయపడ్డాయి. అలాంటి పాత్రని మహాకాళిలో డిజైన్ చేసి పాన్ ఇండియా లుక్ తీసుకొచ్చారు.
ALSO READ: Chiranjeevi - OG Review: మెగా ఫ్యాన్స్‌కి ట్రీట్..
Tollywood: ఇప్పుడు హెచ్.డి. ప్రింట్స్ తో సినిమా వచ్చేస్తోంది
Avatar 2: అవతార్ 2.. మంత్ర ముగ్దులవుతారు..
Mega Fans: బాలయ్యపై ఫిర్యాదు.. తరలి వచ్చిన మెగా అభిమానులు
Urvashi Rautela: ఈడీ కార్యాలయానికి ఊర్వశీ రౌతేల