Tollywood: ఇప్పుడు హెచ్.డి. ప్రింట్స్ తో సినిమా వచ్చేస్తోంది

ABN , Publish Date - Sep 30 , 2025 | 02:27 PM

పైరసీ రాకెట్ ను ఛేదించిన సి.వి. ఆనంద్ ను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కె. ఎల్. దామోదర ప్రసాద్ అభినందించారు. పైరసీ పై నిరంతర నిఘా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

KL Damodara Prasad

పైరసీదారులను అదుపులోకి తీసుకుని, దానిని కూకటివేళ్లతో పెకళించే ప్రయత్నం చేస్తున్న సి.పి. ఆనంద్ (C.P. Anand) ను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి కె. ఎల్. దామోదర ప్రసాద్ (K. L. Damodhara Prasad) అభినందించారు. ఈ విషయమై ఆయన ఏబీయన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధితో మాట్లాడుతూ, 'ఫిలిం ఛాంబర్ కు యాంటీ పైరసీ సెల్ ఎప్పటినుంచో ఉంది. కానీ అవన్నీ ఫిజికల్ పైరసీ ని అడ్డుకోవటానికి ప్రయత్నిస్తాయి. ఈ మధ్యకాలంలో హెడ్. డి. ప్రింట్స్ వస్తున్నాయి. 'గేమ్ ఛేంజర్, #సింగిల్, హిట్ 3' ఇలా వరుసగా సినిమాల క్వాలిటీ ప్రింట్స్ వచ్చాయి. దాంతో మేం జూన్ లో పైరసీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వాన్ని, పోలీసులను అప్రోచ్ అయ్యాం. సి. వి. ఆనంద్ మా కేసును ప్రత్యేకంగా తీసుకుని టీమ్స్ ను ఏర్పాటు చేసి పైరసీ రాకెట్ ను ఛేదించారు. పైరసీ దారులు చాలా అడ్వాన్స్‌డ్ గా హ్యాకింగ్ చేస్తున్నారు. వారిని పట్టుకోవటానికి పోలీసులు తమ స్టిస్టమ్స్ ను అప్డెట్స్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఇక ముందు కూడా పైరసీ పై నిరంతరం నిఘా ఉండాల్సిందే' అని అన్నారు.


సినీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం లేబర్ కమీషనర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు జరిగిందని కె. ఎల్. దామోదర ప్రసాద్ చెబుతూ, ' రెండు నెలల సమయంలో ఈ సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయ'ని అన్నారు. ఇక ట్రంప్ సినిమాల టారిఫ్‌ పెంచడం అనేది ఆ దేశానికి సంబంధించిన పాలసీ అని కె.ఎల్. దామోదర ప్రసాద్ అభిప్రాయ పడ్డారు. కేవలం తెలుగు సినిమాలే కాకుండా అన్ని పర దేశీ చిత్రాలకూ అది వర్తిస్తుందని, తాజా టారిఫ్‌ కు అనుగుణంగా బిజినెస్ మోడల్ ను మార్చుకోవాల'ని ఆయన తెలిపారు.

Also Read: Chiranjeevi - OG Review: మెగా ఫ్యాన్స్‌కి ట్రీట్‌..

Also Read: Avatar 2: అవతార్‌ 2.. మంత్ర ముగ్దులవుతారు..

Updated Date - Sep 30 , 2025 | 02:31 PM