Mega Fans: బాలయ్యపై ఫిర్యాదు.. తరలి వచ్చిన మెగా అభిమానులు
ABN , Publish Date - Sep 30 , 2025 | 10:39 AM
ఇటీవల ఏపీ అసెంబ్లీలో మెగాస్టార్ చిరంజీవిని (Chiranjeevi) ఉద్దేశించి బాలకృష్ణ (Bala Krishna) చేసిన వ్యాఖ్యలపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఏపీ అసెంబ్లీలో మెగాస్టార్ చిరంజీవిని (Chiranjeevi) ఉద్దేశించి బాలకృష్ణ (Bala Krishna) చేసిన వ్యాఖ్యలపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకులో అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి మెగా ఫ్యాన్స్ తరలివచ్చారు(Mega Fans Fire). బాలకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఫ్యాన్స్ సిద్ధమయ్యారు.
ALSO READ: Pawan Kalyan: ‘కాంతార చాప్టర్ 1’ చిత్రానికి.. ఇబ్బందులు కలిగించవద్దు
సోమవారం జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌తోపాటు మంగళవారం.. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా 300 పీఎస్‌లలో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీ వద్దని వారించారని, అది మన సంస్కారం కాదంటూ అఖిల భారత చిరంజీవి యువతకు సూచించారని తెలిసింది. చిరు విజ్ఞప్తితో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్న అభిమానులు విరమించుకున్నారు.
ALSO READ: Trump: ట్రంప్ నిర్ణయం.. అమెరికాలో తెలుగు సినిమాలకు పెద్ద షాక్
Mega Family: పవన్‌తో కలిసి ‘ఓజీ’ సినిమా వీక్షించిన మెగా ఫ్యామిలీ
The Raja Saab Trailer: వింటేజ్ ప్రభాస్ ఓకే.. కానీ, ఏదో మిస్సయ్యినట్టుందే