Akkineni Venkat: ఆగిపోయిన డైరెక్షన్ డెబ్యూ మూవీ

ABN , Publish Date - Aug 13 , 2025 | 08:40 AM

అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కుమారుడు వెంకట్ దర్శకుడు కావాలనుకున్న విషయం చాలామందికి తెలియదు. అయితే ఆ సినిమా పూర్తి కాకుండానే ఆగిపోయింది!

Akkineni Venkat directorial debut movie

దాదాసాహేబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) నట వారసత్వాన్ని సినిమా రంగంలో కొనసాగిస్తున్న వ్యక్తి ఆయన రెండో కొడుకు నాగార్జున. అక్కినేని పెద్ద కొడుకు వెంకట్ చాలా కాలం అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలతో పాటు, ఆ బ్యానర్ లో తీసిన సినిమాల నిర్మాణ వ్యవహారాలను చూసేవారు. ఆ తర్వాత నిదానంగా చిత్రసీమకు దూరమయ్యారు. ఇప్పుడు స్టూడియో నిర్వహణ బాధ్యత కూడా అక్కినేని నాగార్జునే చూసుకుంటున్నారు. నటుడు కావాలన్నది నాగార్జున కోరిక. అది నెరవేర్చుకున్నారు. అయితే అక్కినేని వెంకట్ కు నిర్మాతగా వ్యవహరిస్తూనే దర్శకుడు కావాలనే కోరిక ఉండేదట.


అక్కినేని వెంకట్ దర్శకుడిగా ఓ సినిమా కూడా ప్రారంభించారని, దానికి మాటల రచయితగా తాను వర్క్ చేశానని రాజసింహా తెలిపారు. దాదాపు 60 సినిమాలకు రచయితగా పనిచేసిన రాజసింహా తడినాడ 'ఒక్క అమ్మాయి తప్ప' సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. ఆ తర్వాత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో అక్కినేని వెంకట్ దర్శకత్వంలో మొదలైన తొలి చిత్రం గురించి ఆయన ఆసక్తికరమైన విషయాలను రాజసింహా తెలిపారు.

av2.jpg

జగపతి రాజేంద్ర ప్రసాద్, అక్కినేని నాగేశ్వరరావు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ కారణంగా జగపతి బాబు హీరోగా అక్కినేని వెంకట్ ఓ సినిమాను తన దర్శకత్వంలో మొదలు పెట్టారట. అప్పటికి ఆ సినిమాకు 'నేను పుట్టాను' అనే టైటిల్ కూడా అనుకున్నారట. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో కాకుండా 'జెమినీ' కిరణ్ నిర్మాతగా చేయాలని అనుకున్నారట. అయితే ఆ సినిమా ఆగిపోయిందని రాజసింహా తెలిపారు. పూర్తి వినోదభరితమైన ఈ చిత్రం పూర్తయ్యి విడుదల అయ్యి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. ఫన్ రైడ్ స్క్రీప్ట్ ను ఆ సినిమా కోసం తయారు చేశామని తెలిపారు. ఒకవేళ 'నేను పుట్టాను' సినిమా విడుదలై విజయం సాధించి ఉంటే... అక్కినేని వెంకట్ ఇవాళ తెలుగులో ప్రామిసింగ్ డైరెక్టర్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుని ఉండేవారు. కానీ విధి ఆయన్ని మరో మార్గంలోకి నడిపింది.

Also Read: Wednesday Tv Movies: బుధ‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

Also Read: Gayathri Gupta: కనీసం కాల్‌ లేదు.. కలవలేదు.. కష్టాన్ని అర్థం చేసుకుని..

Updated Date - Aug 13 , 2025 | 08:48 AM

Akkineni Family: ఒకవైపు నాగచైతన్య పెళ్లి.. మరో వైపు అఖిల్ నిశ్చితార్థం

Akkineni Family: ఒకే ఫ్రేమ్ లో అక్కినేని కోడళ్లు.. అత్తగారు కూడా ఉంటేనా

Akkineni Family Hero: మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అక్కినేని హీరో

Akkineni Nagarjuna: అదేంటో చెప్పను ప్లీజ్‌!

Akkineni Nageswararao: నటుడు రచయితగా మారిన వేళ