Akkineni Family: ఒకే ఫ్రేమ్ లో అక్కినేని కోడళ్లు.. అత్తగారు కూడా ఉంటేనా

ABN , Publish Date - Jun 28 , 2025 | 09:12 PM

అఖిల్ అక్కినేని (Akhil Akkineni) వివాహం జూన్ 6 న చాలా సింపుల్ గా జరిగిన విషయం తెల్సిందే. తన కంటే 9 ఏళ్లు పెద్దది అయిన జైనబ్ (Zainab) మెడలో మూడు ముళ్లు వేశాడు.

Akkineni Family

Akkineni Family: అఖిల్ అక్కినేని (Akhil Akkineni) వివాహం జూన్ 6 న చాలా సింపుల్ గా జరిగిన విషయం తెల్సిందే. తన కంటే 9 ఏళ్లు పెద్దది అయిన జైనబ్ (Zainab) మెడలో మూడు ముళ్లు వేశాడు. అక్కినేని వారసుడి పెళ్లి అంటే ఏ రేంజ్ లో జరుగుతుందో అని అందరూ ఎంతగానో ఎదురుచూసారు. కానీ, నాగ్ మాత్రం ఇద్దరు కొడుకుల పెళ్లి చాలా సింపుల్ గా ముగించేశాడు. ఇక అఖిల్ పెళ్లిలో కూడా ఎక్కువ కెమెరాలు కనిపిచ్న్హలేదు. అందుకే ఎక్కువ ఫోటోలు బయటకు రాలేదు. ఇక ఈమధ్యనే అఖిల్ పెళ్లి ఫోటోలు బయటపడుతున్నాయి.


నిన్నటికి నిన్న అఖిల్.. తన జీవితంలోని అత్యుత్తమ రోజులోని కొన్ని క్షణాలు అంటూ పెళ్లి ఫోటోలను షేర్ చేయగా .. ఇంకొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యేక్షమయ్యాయి. అందులో అఖిల్ - జైనబ్ జంట చైతన్య - శోభిత కనిపించారు. అక్కినేని కుటుంబం మొత్తం కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక ఇన్ని ఫొటోల్లో అందరిని ఆకర్షించిన ఫోటో అక్కినేని కోడళ్లదే. శోభితా , జైనబ్ ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఈ ఫొటోలో శోభితా.. జైనబ్ ను పెళ్లి కూతురు లుక్ లో చూసి ఆశ్చర్యపోతూ ఆమెను హాగ్ చేసుకున్నప్పుడు తీసిన ర్యాండమ్ ఫోటో అని తెలుస్తోంది. పెద్ద కోడలిగా శోభితా ఎంతో హుందాగా కనిపించింది. నిండైన చీరకట్టు, ముడి వేసి.. అచ్చ తెలుగింటి కోడలిగా కనిపించింది. ఇక ఈ ఇద్దరు కోడళ్ల మధ్య అత్తగారు అమల కూడా ఉంటే ఎంత బావుండేదో అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక అక్కినేని నాగార్జున ఫ్యామిలీ మొత్తం రెండో వివాహం చేసుకున్న విషయం తెల్సిందే.


నాగార్జున మొదట దగ్గుబాటి లక్ష్మీని వివాహం చేసుకున్నాడు. వారికి పుట్టిన కొడుకే నాగ చైతన్య. లక్ష్మీ విదేశాల్లో సెటిల్ అయ్యింది. ఇక అమల, చైను పెద్ద కొడుకుగానే చూస్తుంది. అఖిల్- చై ఎప్పుడు ఒక తల్లి బిడ్డల్లానే కనిపిస్తారు. ఇప్పుడు ఈ తోడికోడళ్లు కూడా అక్కాచెల్లెళ్లుగానే కనిపిస్తున్నారు. వీరి బంధం ఎప్పుడు కలకాలం కలిసి ఉండాలని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Updated Date - Jun 28 , 2025 | 09:12 PM