Gayathri Gupta: కనీసం కాల్‌ లేదు.. కలవలేదు.. కష్టాన్ని అర్థం చేసుకుని..

ABN , Publish Date - Aug 13 , 2025 | 12:17 AM

ఫిదా సినిమాలో సాయిపల్లవి స్నేహితురాలిగా కనిపించి మెప్పించారు గాయత్రి గుప్తా (gayathri Gupta) . తదుపరి పలు చిత్రాల్లో నటించినా అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత మీటూ, క్యాస్టింగ్‌ కౌచ్‌ అంటూ గొంతెత్తడంతో అవకాశాలు దూరమయ్యాయి

ఫిదా సినిమాలో సాయిపల్లవి స్నేహితురాలిగా కనిపించి మెప్పించారు గాయత్రి గుప్తా (gayathri Gupta) . తదుపరి పలు చిత్రాల్లో నటించినా అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత మీటూ, క్యాస్టింగ్‌ కౌచ్‌ అంటూ గొంతెత్తడంతో అవకాశాలు దూరమయ్యాయి. దాంతో ఇబ్బందులకు గురైంది. మరో పక్క తల్లిదండ్రులతో సమస్యలు, ఇష్టం లేని పెళ్లి మొత్తం కెరీర్‌ తారుమారు అయిపోయింది. మరో పక్క ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌ బారిన పడింది. ట్రీట్మెంట్‌ కోసం చాలా ఖర్చు పెట్టింది. చేతిలో చిల్ల గవ్వ లేకుండా పోయింది. రెంట్‌ కూడా కట్టుకోడానికి డబ్బుల్లేని దీనస్థితిలోకి వెళ్లిపోయిన సమయంలో ఫిదా సినిమాలో తన నటన నచ్చి స్నేహితుడైన సందీప్‌ రెడ్డి వంగాకు (Sandeep Reddy Vanga) ఓ మెసేజ్‌ చేసిన సాయం కోరింది గాయత్రి గుప్తా. ఈ విషయాన్ని తాజాగా ఓ పోడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

"చాలా క్లిష్టమైన స్థితిలో స్నేహితుడైన సందీప్‌రెడ్డి వంగాకు ఓ మెసేజ్‌లో నా కష్టాన్ని చెప్పాను. ట్రీట్‌మెంట్‌కు మనీ కావాలని అడిగా. వెంటనే రిపోర్ట్‌, ట్రీట్‌మెంట్‌కు ఎంత ఖర్చు అవుతుందో పెట్టమన్నాడు. నేను పీపీటీ చేసి పంపించాను. కలవలేవు, కాల్‌ చేయలేదు. వారం రోజుల్లో ఐదున్నర లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. అలా నేను అనారోగ్యం నుంచి బయటపడ్డాను’’ అని చెప్పింది గాయత్రి గుప్తా. సందీప్‌ మంచితనాన్ని తెలుసుకున్న నెటిజన్లు, అభిమానులు సందీప్‌ రెడ్డి వంగాను ప్రశంసిస్తున్నారు. గత ఏడాది యానిమల్‌ చిత్రంతో హిట్‌ అందుకున్న ఆయన ప్రస్తుతం ప్రభాస్‌తో స్పిరిట్‌ చిత్రం చేస్తున్నారు.

Updated Date - Aug 13 , 2025 | 12:17 AM