Akkineni Family: అక్కినేని చిన్న కోడలు బర్త్ డే.. కాన‌రాని శోభిత

ABN , Publish Date - Sep 10 , 2025 | 06:32 PM

అక్కినేని కుటుంబం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇప్పటిదాకా ఏదో కాంట్రవర్సీ కారణంగా కనిపించిన ఫ్యామిలీ ఈ సారి అదిరిపోయే వీడియోతో టాక్ ఇప్ ది టౌన్ అయ్యారు. దాన్ని చూసి ఫ్యాన్స్ తెగకు ఖుషీ అవుతున్నారు.

కామన్ గా ..అక్కినేని కుటుంబం (Akkineni Family) లో ఏ సెలబ్రేషన్స్ జరిగినా సందడిగా సాగిపోతుంటాయి. ఫ్యామిలీ మొత్తం ఒక్క చోట చేరి పండగల చేసుకుంటారు. అలా తాజాగా అక్కినేని ఫ్యామిలీ తమ కొత్త కోడలు జైనాబ్ రావూజీ (Zainab Ravdjee) ఫస్ట్ బర్త్‌డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది. సూపర్ స్టైలిష్‌గా ఆర్గనైజ్ చేసింది. ఇక అఖిల్ (Akhil ) ఒక క్యూట్ పిక్ షేర్ చేసి, "నీవే నా ప్రపంచం అని క్యాప్షన్ జోడించాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది.


అక్కినేని చిన్న కోడలు బర్త్ డే పార్టీ హైదరాబాద్లోని ఓ హోటల్లో ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య జరిగినట్లు సమాచారం. ఈ వేడుకల వీడియోలో నాగార్జున (Nagarjuna Akkineni), నాగచైతన్య (Naga Chaitanya ), అఖిల్ (Akhil) ముగ్గురూ కలిసి దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వాళ్లు వెన్యూని సెట్ చేస్తున్న ఒక క్లాసీ వీడియో నెట్‌లో తెగ స్పీడ్‌గా సర్కులేట్ అయింది. ఈ సెలబ్రేషన్ అక్కినేని ఫ్యామిలీ బాండింగ్‌ని, జైనాబ్‌ని వాళ్ల కుటుంబంలోకి ఆహ్వానించిన విధానాన్ని చూపిస్తోంది. ఫ్యాన్స్ ఈ స్వీట్ మూమెంట్స్ చూసి ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే శోభిత షూటింగ్ కారణంగా వేడుకలకు దూరంగా ఉన్నట్లు సమాచారం.

జైనాబ్, ఢిల్లీ నుంచి వచ్చిన సూపర్ టాలెంటెడ్ థియేటర్ ఆర్టిస్ట్, సోషల్ మీడియా స్టార్. ఇండియా, దుబాయ్, లండన్‌లో తన స్టైల్‌తో, నటనతో అదరగొడుతోంది. అఖిల్‌తో రెండేళ్ల క్రితం స్టార్ట్ అయిన ఫ్రెండ్‌షిప్ లవ్ స్టోరీగా మారి, లాస్ట్ ఇయర్ నవంబర్‌లో ఎంగేజ్‌మెంట్‌కి దారితీయడంతో పాటు పెళ్లి వరకు చేరింది. జైనాబ్ డాడ్ జుల్ఫీ రావూజీ నాగార్జునకి బెస్టీ. బిగ్ బిజినెస్ మాగ్నెట్. అఖిల్ టాలీవుడ్‌లో తన మార్క్ సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, కానీ ఇంకా బిగ్ బ్రేక్ కొట్టలేదు. జైనాబ్ రాకతో అయినా అఖిల్ దశ తిరుగుతుందని అభిమానులు అనుకుంటున్నారు.

Read Also: Veera Chandrahasa: అక్క‌డ‌ వంద రోజులు ఆడింది.. ఇప్పుడు తెలుగులో థియేట‌ర్ల‌కు వ‌స్తోంది

Read Also: BhadraKaali: విజ‌య్ అంటోని ‘భద్రకాళి’ ట్రైల‌ర్‌! మ‌రో.. హిట్ ప‌క్కా


ఇవి కూడా చ‌ద‌వండి...

Mirai Review: తేజ స‌జ్జా.. మిరాయ్ సినిమా రివ్యూ

Telusu Kada: డీజే టిల్లును.. మించి ఉందిగా! తెలుసుక‌దా టీజ‌ర్

Paradha OTT: స‌డ‌న్‌గా.. ఓటీటీకి వ‌చ్చి షాకిచ్చిన ప‌ర‌దా! రెండు వారాల‌కే

Ritu Varma: రీతూ వ‌ర్మ‌.. నువ్వు కూడానా! ఇంత షాకిచ్చావేంటి

Mirai Twitter X RevIew: తేజ స‌జ్జా.. మిరాయ్ ట్విట్ట‌ర్ రివ్యూ! ఎలా ఉందంటే

Raghava Lawrence: సొంతింటిని.. స్కూల్‌గా మార్చిన రాఘ‌వ లారెన్స్

Ananya Nagalla: అన‌న్య నాగ‌ళ్ల‌.. ఊపేస్తోందిగా! కుర్రాళ్ల.. నిగ్ర‌హం నిలిచేనా

Updated Date - Sep 12 , 2025 | 01:18 PM