Jana Nayagan: సాగరం ఆవల ఆడియో వేడుక

ABN , Publish Date - Aug 07 , 2025 | 07:10 PM

దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' ఆడియో వేడుక ఘనంగా మలేసియాలో జరుగబోతోంది. పూజా హెగ్డే నాయికగా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా చేస్తున్నాడు.

Jana Nayagan

దళపతి విజయ్ (Vijay) చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) పొంగల్ కానుకగా జనవరి 9న విడుదల కానుంది. విజయ్ రాజకీయ పార్టీ పెట్టి, వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న నేపథ్యంలో ఇకపై నటనకు స్వస్తి చెబుతానని ప్రకటించాడు. దాంతో హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న 'జన నాయగన్' అతనికి చివరి సినిమా. ఈ సినిమా తెలుగులోనూ 'జన నాయకుడు' పేరుతో డబ్ అవుతోంది.

విజయ్ సరసన పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ (Bobby Deol), గౌతమ్ వాసుదేవ మీనన్ (Gautham Vasudev Menon), ప్రకాశ్ రాజ్ (Prakash Raj), ప్రియమణి (Priyamani) తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) దీనికి సంగీతం సమకూర్చాడు. ఈ సినిమా ఆడియో వేడుకను కనీవినీ ఎరుగని రీతిలో భారీ స్థాయిలో చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. సాగర తీరం దాటి ఈ వేడుక జరపాలన్నది వారి ప్లాన్. డిసెంబర్ 27న మలేసియాలో గ్రాండ్ గా దీన్ని జరిపే ఆలోచనలో ఉన్నారు. ఇందుకోసం రెండు వేదికలను పరిశీలిస్తున్నారట. అక్కడి స్టేడియం బుకిత్ జలీల్ లో లేదా పుత్రజయలో ఈ వేడుకను జరుపబోతున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కు ఇది రెండో తమిళ చిత్రం. దీనికి ముందు సూర్య 'కంగువా'లో అతను విలన్ గా నటించాడు.


'జన నాయగన్' విజయ్ చివరి చిత్రమని మేకర్స్ చెబుతున్న 2026లో తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ సాధించే విజయం మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే గతంలో ఎంతోమంది నటులు రాజకీయ పార్టీలు పెట్టినప్పుడు ఇక సినిమాలలో నటించమని భారీ స్టేట్ మెంట్స్ ఇచ్చారు. కానీ పొలిటికల్ గా ఆశించిన స్థాయిలో విజయం దక్కకపోవడంతో తిరిగి నటనపై ఫోకస్ పెట్టారు. నటులుగా సినిమాలు చేస్తేనే ప్రజలకు చేరువ అవుతామని వారికి అనిపించింది. ఒకవేళ విజయ్ పార్టీ సైతం ఆశించిన స్థాయిలో సీట్లను గెలుచుకోకపోతే... తిరిగి ఆయన సినిమాల్లో నటించే ఆస్కారం ఉంది. విజయ్ ఒప్పుకోవాలే గానీ ఆయనతో సినిమాలు చేయడానికి చాలా మంది నిర్మాతలు, దర్శకులు రెడీ గా ఉన్నారు. లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) అయితే... విజయ్ ను దృష్టిలో పెట్టుకుని ఓ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకున్నాడట!

Also Read: Sonakshi Sinha: 'జటాధార' విడుదలకు ముందే...

Also Read: Theater Movies: ఈ శుక్ర‌వారం.. ఇండియా వైడ్ థియేట‌ర్ల‌కు వ‌స్తున్న సినిమాలివే! స‌గం హ‌ర్ర‌ర్ మూవీసే

Updated Date - Aug 07 , 2025 | 07:12 PM

Thalapathy Vijay: 23 ఏళ్ల తర్వాత విడాకులు!?.. సన్నిహితుల రియాక్షన్

Thalapathy Vijay: ఒకే ఒక్క సిట్టింగ్‌లో.. మరో టాలీవుడ్ దర్శకుడితో విజయ్ మూవీ!

Thalapathy Vijay: ద‌ళ‌ప‌తి విజయ్ ఇంటికి మ‌రో లగ్జరీ కారు

Thalapathy 69: విజయ్ 69, డీవీవీ మూవీ అటకెక్కిన‌ట్టేనా?

Thalapathy69: దళపతి విజయ్ చివరి చిత్ర ప్రకటన వచ్చేసింది..