Akhanda 2: Thaandavam: పవర్‌ఫుల్‌గా 'అఖండ తాండవం' టీజర్..
ABN, Publish Date - Jun 09 , 2025 | 06:17 PM
నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తోన్న నాలుగో చిత్రం అఖండ - 2: తాండవం. దీనికి ముందు వచ్చిన అఖండ చిత్రం ఎంతగా హిట్ అయిందో తెలిసిందే. దానికి కొనసాగింపుగా అంతకు మించి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా విడుదల తేదినీ ప్రకటిస్తూ టీజర్‌ను విడుదల చేశారు. 'నా శివుడు అనుమతి లేనిది ఆ యముడైన కన్నెతి చూడడు.. నువ్వు చూస్తావా? 'అంటూ బాలయ్య టీజర్‌లో చెప్పిన డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నారు.
Updated at - Jun 09 , 2025 | 06:19 PM