సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

80S Stars Reunion: చిరుత థీమ్‌తో ఆటలుపాటలు.. మధుర జ్ఞాపకాలు.. వీడియో వైరల్‌..

ABN, Publish Date - Oct 07 , 2025 | 03:38 PM

1980ల వెండితెరపై అలరించిన ఉత్తరాది, దక్షిణాది తారలు ‘80s రీ యూనియన్‌’ పేరుతో ఓ చోట కలిసి సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

1980ల వెండితెరపై అలరించిన ఉత్తరాది, దక్షిణాది తారలు ‘80s రీ యూనియన్‌’ (80S stars Reunion) పేరుతో ఓ చోట కలిసి సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. 12 ఏళ్లగా ఈ గేదరింగ్‌ జరుగుతోంది. చెన్నై, హైదరాబాద్‌, ఊటీ వంటి ప్రాంతాల్లో 30కి పైగా తారలు ఒకచోట చేరి సరదాగా గడుపుతుంటారు. అలనాటి జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ ఆటపాటలతో ఎంజాయ్‌ చేస్తుంటారు. ఈ ఏడాది రీయూనియన్‌కు చెన్నై వేదిక అయింది. ఈసారి డ్రెస్‌ కోడ్‌కు చిరుత థీమ్‌ను ఎంచుకున్నారు.

రెండ్రోజుల క్రితం జరిగిన ఈ వేడుక ఫొటోలు నెట్టింట  వైరల్‌ అయిన సంగతి తెలిసిందే! తాజాగా దీనికి సంబంధించిన వీడియోను వీకే నరేశ్‌ షేర్‌ చేయగా అది కూడా విపరీతంగా వైరల్‌ అవుతోంది.  'ఇది 12వ సారి జరిగిన రీయూనియన్‌' అని ఆయన తెలిపారు. ఈ వేడుకలో..చిరంజీవి, వెంకటేశ్‌, జాకీ ష్రాఫ్‌, శరత్‌ కుమార్‌, రాజ్‌కుమార్‌ సేతుపతి, నరేశ్‌, సుప్రియ, భాను చందర్, ప్రభు, సురేష్,  సుహాసిని, నదియ, రాధ, రమ్యకృష్ణ, సుమలత, రేవతి, జయసుధ, శోభనలతో పాటు మరికొందరు ఈ వేడుకలో పాల్గొన్నారు.

ALSO READ: Srikantha Addala: కిరణ్‌ అబ్బవరం మూవీ డైరెక్టర్ మారిపోయాడా...

Nora Fatehi: నోరా ఫతేహి స్పెషల్ సాంగ్ వచ్చేసింది

Mithra Mandali Trailer: 'మిత్ర మండలి' ట్రైలర్‌.. నవ్వులే నవ్వులు

Jr NTR: ఆగిన దాదా సాహేబ్ ఫాల్కే బయోపిక్...






Updated Date - Oct 07 , 2025 | 03:56 PM