Mithra Mandali Trailer: 'మిత్ర మండలి' ట్రైలర్‌.. నవ్వులే నవ్వులు

ABN, Publish Date - Oct 07 , 2025 | 02:08 PM

'మిత్ర మండలి' సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో  ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, విష్ణు ఓఐ, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా వింతైన పరిస్థితుల్లో చిక్కుకున్న విచిత్రమైన వ్యక్తులుగా కనిపిస్తున్నారు. వారి మాటలు, చేష్టలు నవ్వుల జల్లు కురిపిస్తున్నాయి. ట్రైలర్ చూస్తే దీపావళికి నవ్వుల టపాసులు పేల్చడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. విజయేందర్ ఎస్ దర్శకుడు.  కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప్, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మాతలు. అక్టోబర్ 16న ఈ చిత్రం విడుదల కానుంది. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఆద్యంతం నవ్వులతో సాగిన ఈ ట్రైలర్ ను మీరు చూసేయండి.