Jr NTR: ఆగిన దాదా సాహేబ్ ఫాల్కే బయోపిక్...

ABN , Publish Date - Oct 07 , 2025 | 12:48 PM

ప్రముఖ దర్శకుడు రాజమౌళి నిర్మించాలని అనుకున్న 'దాదా సాహెబ్ ఫాల్కే' బయోపిక్ 'మేడ్ ఇన్ ఇండియా' వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఇందులో ఫాల్కే గా జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నాడనే ప్రచారం బాగా జరిగింది. అయితే ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ బయోపిక్ ఇప్పట్లో సెట్స్ కు వెళ్ళడం లేదట.

Dadasaheb Palke biopic

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రెండేళ్ళ క్రితం 'మేడ్ ఇన్ ఇండియా' పేరుతో భారత సినీ పితామహుడు దాదా సాహేబ్ ఫాల్కే బయోపిక్ నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. మాక్స్ స్టూడియోస్ కు చెందిన వరుణ్ గుప్తాతో కలిసి, తన కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ దీనిని నిర్మిస్తారని రాజమౌళి తెలిపాడు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ను తెరకెక్కించే బాధ్యతలను దర్శకుడు నితిన్ కక్కర్ కు రాజమౌళి అప్పగించాడు. అయితే... రాజమౌళి నిర్మించే దాదా సాహేబ్ ఫాల్కే బయోపిక్ లో జూనియర్ ఎన్టీయార్ టైటిల్ రోల్ పోషించబోతున్నాడనే మాట ఆ సమయంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఎన్టీఆర్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోయినా... దానిని ఇటు రాజమౌళి కానీ అటు ఎన్టీయార్ కానీ ఖండించలేదు. సో... దాదాసాహెబ్ ఫాల్కేగా ఎన్టీయార్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే అంతా భావించారు. అయితే ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ ను మేకర్స్ హోల్డ్ లో పెట్టినట్టు సమాచారం. ముంబై నుండి వెలువడే ఓ ప్రముఖ దిన పత్రిక ఈ విషయమై ఓ కథనాన్ని ప్రచురించింది. ఎన్టీయార్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టారని తెలిపింది.


ప్రస్తుతం జూనియర్ ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత 'దేవర'కు సీక్వెల్ చేయాల్సి ఉంది. అలానే మరో ఒకటి రెండు సినిమాలకు ఎన్టీయార్ కమిట్ అయ్యాడనే వార్తలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'దాదా సాహేబ్ ఫాల్కే' మూవీ ఇప్పట్లో మొదలు కాదని, ఇది పట్టాలెక్కాలంటే మరి కొన్ని సంవత్సరాలు పడుతుందని ఈ పత్రిక తెలిపింది. 'దాదా సాహెబ్ ఫాల్కే' బయోపిక్ లో రాజమౌళి భారత స్వాతంత్ర సంగ్రామం, అందులో దాదాసాహెబ్ ఫాల్కే పాత్ర, తన సినిమాల ద్వారా ఫాల్కే ఈ దేశానికి ఇచ్చిన కల్చరల్ కంట్రిబ్యూషన్ వీటన్నింటినీ చూపించాలని అనుకున్నారట. ఇదిలా ఉంటే... రాజమౌళి 'దాదా సాహెబ్ ఫాల్కే' మూవీ ప్రకటన వచ్చిన సమయంలోనే ఆమీర్ ఖాన్ కూడా ఫాల్కేపై ఓ సినిమా నిర్మిస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఈ సినిమాను రాజ్ కుమార్ హిరానీ డైరెక్ట్ చేయబోతున్నారు. అయితే... ఈ మూవీకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోందని తెలుస్తోంది.

Also Read: The Conjuring Last Rites: రూ.3800 కోట్లు కొల్ల‌గొట్టింది.. సైలెంట్‌గా ఓటీటీకి వ‌చ్చేసింది! సూప‌ర్ నాచుర‌ల్ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్‌

Also Read: OG Songs: త‌మ‌న్ రేర్ రికార్డ్.. 2025 టాప్‌లో ఓజీ సాంగ్స్‌

Updated Date - Oct 07 , 2025 | 01:08 PM