సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sir Madam: మరో మంచి సినిమా ఓటీటీకి బలి..

ABN, Publish Date - Jul 25 , 2025 | 06:33 PM

ఈమధ్య కాలంలో చిన్న సినిమాలే ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఎన్నో అంచనాలను పెట్టుకొని థియేటర్ కు వెళ్లిన సినిమాలు అంతగా మెప్పించలేకపోతున్నాయి.

Sir Madam

Sir Madam: ఈమధ్య కాలంలో చిన్న సినిమాలే ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఎన్నో అంచనాలను పెట్టుకొని థియేటర్ కు వెళ్లిన సినిమాలు అంతగా మెప్పించలేకపోతున్నాయి. చిన్న సినిమాగా ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. అరెరే.. థియేటర్ లో రిలీజ్ అయితే బావుండేదే అన్న మాట బయటకు వస్తుంది. అనగనగా, టూరిస్ట్ ఫ్యామిలీ, మై బేబీ.. ఇలా కథలు బావుండి.. థియేటర్ లో నోచుకోని సినిమాలు అంటే ఇవే అని చెప్పొచ్చు. అంటే తమిళ్ లో రిలీజ్ అయినా కూడా తెలుగు ప్రేక్షకులు థియేటర్ లో చూడలేని సినిమాలు అన్నమాట. తాజాగా ఈ సినిమాల లిస్ట్ లో సార్ మేడమ్ కూడా చేరిందని అంటున్నారు.


మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, నిత్యామీనన్ జంటగా పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తలైవా తలైవి. ఈ సినిమానే తెలుగులో సార్ మేడమ్ పేరుతో రిలీజ్ చేయాలనుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ , సాంగ్స్ తెలుగు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. విజయ్ సేతుపతి, నిత్యామీనన్ జంట తెలుగువారిని కూడా ఆకర్షించింది. అన్ని బావుంటే.. జూలై 25 న అనగా ఈ శుక్రవారం తెలుగులో కూడాఈ సినిమా రిలీజ్ అయ్యి ఉండేది. కానీ, హరిహర వీరమల్లు దెబ్బ.. సార్ మేడమ్ ను గట్టిగా కొట్టేసింది.


తెలుగులో థియేటర్లు దొరక్క.. సార్ మేడమ్ కేవలం తమిళ్ లో మాత్రమే రిలీజ్ అయ్యింది. వీరమల్లు సగానికి పైగా థియేటర్లు అందుకోగా.. మిగిలిన కొన్ని థియేటర్లు మహావతార్ నరసింహా అందుకుంది. యానిమేషన్ సినిమా అయినా హోంబాలే లాంటి పెద్ద బ్యానర్ కావడంతో.. థియేటర్లు వారి చేతికి చిక్కాయి. అలా సార్ మేడమ్ కు థియేటర్లు దగ్గకపోవడంతో తెలుగులో లేకుండా కేవలం తమిళ్ లోనే రిలీజ్ చేశారు. మొదటి నుంచి సినిమాపై అభిమానులు మంచి పాజిటివ్ టాక్ పెట్టుకోవడంతో.. తమిళ్ లో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. వినోదాత్మకంగా.. భార్యాభర్తల మధ్య గొడవలను చూపిస్తూనే చివరకు భార్యాభర్తల బంధం ఎలా ఉండాలి అనేది ఎంతో అద్భుతంగా చూపించారట.


తమిళ్ లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకోవడంతో మేకర్స్ తెలుగులో థియేటర్ లో రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అదేంటి అలా అంటే.. వేరే ఛాయిస్ వారికి లేదు. వీరమల్లు తరువాత పెద్ద పెద్ద సినిమాలు లైన్లో ఉన్నాయి. జూలై 31 న కింగ్డమ్ వస్తుంది. ఇక దీని తరువాత ఆగస్టు.. ఈ నెల అంతా వార్ 2, కూలీ హల్చల్ చేస్తూ ఉంటాయి.


ఇంకా సమయం పెరిగేకొద్దీ పెద్ద సినిమాలు వస్తూనే ఉంటాయి కానీ తగ్గవు. లేట్ అయ్యే కొద్దీ థియేటర్లు దొరుకుతాయి అనే నమ్మకం లేదు. అందుకే మేకర్స్.. సార్ మేడమ్ ను ఓటీటీలోనే స్ట్రీమింగ్ చేయాలనీ చూస్తున్నారరట. త్వరలోనే ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. అలా ఒక మంచి సినిమా థియేటర్లు లేక ఓటీటీకి బలి అవుతుంది. మరి ఈ సినిమా ఇక్కడ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Jamie Lever: అతను వీడియో కాల్ లో బట్టలు విప్పమన్నాడు

Nara Rohit: పుట్టిన రోజు సందర్భంగా 'సుందర కాండ' రిలీజ్ డేట్

Updated Date - Jul 25 , 2025 | 06:33 PM