Jamie Lever: అతను వీడియో కాల్ లో బట్టలు విప్పమన్నాడు

ABN , Publish Date - Jul 25 , 2025 | 05:34 PM

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ (Casting Couch) ను ఎదుర్కోకుండా బయటపడిన ఒక్క హీరోయిన్ లేదు అంటే అతిశయోక్తి కాదు.

Jamie Lever

Jamie Lever: ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ (Casting Couch) ను ఎదుర్కోకుండా బయటపడిన ఒక్క హీరోయిన్ లేదు అంటే అతిశయోక్తి కాదు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చినవారైనా.. స్టార్ హీరోయిన్లు అయినా ఏదో ఒక సమయంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నవారే. స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ కావాలంటే కమిట్ మెంట్ ఇవ్వాలి. మొదటి హీరోయిన్ గా ఛాన్స్ కావాలలంటే నిర్మాత రూమ్ కి వెళ్లాలి. అందంగా చుపించాలంటే సినిమాటోగ్రాఫర్ దగ్గరకు వెళ్లాలి.. అసలు ఇండస్ట్రీలో అవకాశం రావాలన్నా రూమ్ కి వెళ్ళాలి.


ఇక్కడితో ఆగాయా అంటే లేదు. లైంగిక వేధింపులు.. షూటింగ్స్ లో, ఆడిషన్స్ లో ప్రెస్ మీట్ లలో ఇలా ఎక్కడా ఆడదానికి భద్రత లేదు. ఇది కేవలం ఇండస్ట్రీకి వచ్చే కొత్తవారికే కాదు. నట వారసురాళ్లకు కూడా తప్పడం లేదు. బాలీవుడ్ స్టార్ కమెడియన్ జానీ లివర్ కుమార్తె జామీ లివర్ సైతం క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు చెప్పడం ప్రస్తుతం సెన్సేషన్ గా మారింది. తండ్రి బాటలోనే కామెడీ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది జామీ. తెలుగులో ఆమె ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాలో నటించింది. నరేష్, ఫరియా జంటగా నటించిన ఈ చిత్రంలో నరేష్ కు వదినగా ఆమె నవ్వులు పూయించింది.


ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న జామీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాన్ క్యాస్టింగ్ కౌచ్ సంఘటనను బయటపెట్టింది. ' కెరీర్ ప్రారంభంలో నాకు మేనేజర్ అంటూ ఎవరూ ఉండేవారు కాదు. ఎవరు ఆడిషన్ కు పిలవాలన్నా నా నాకే ఫోన్ వచ్చేది. ఒకసారి ఒక ఇంటెర్నేషనల్ సినిమాలో ఛాన్స్ అని ఒక వ్యక్తి వీడియో కాల్ చేశాడు. నేను కూడా కథ బాగా అర్ధం కావాలని ఇలా ఎదురెదురు కూర్చొని మాట్లాడతాడేమో అని అలాగే ఉండిపోయాను. అతని ముఖం నాకు కనిపించడం లేదు. నన్ను మాత్రం అతను చూస్తున్నట్లు చెప్పాడు.


కథ మొత్తం వివరిస్తూ.. చాలా మంచి పాత్ర. కామెడీతో పాటు చాలా బోల్డ్ గా ఉంటుంది అని చెప్పాడు. ఆ తరువాత నీ ముందు ఒక 50 ఏళ్ల వ్యక్తి ఉన్నట్లు ఊహించుకో.. నెమ్మదిగా బట్టలు విప్పు అన్నాడు. నేను షాక్ అయ్యా. వీడియో కాల్ లో ఇలాంటివి నాకు సౌకర్యంగా ఉండవు. బోల్డ్ పాత్ర అయితే నేను సీన్ లో చేస్తాను అని చెప్పాను. అతను వినకుండా ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఆ పాత్రకు నువ్వు సెట్ అవుతావో లేదో చూడాలి కదా. పర్లేదు బట్టలు విప్పు అన్నాడు. వెంటనే నేను నాకు ఇలా చేయడం సౌకర్యంగా లేదు అని టక్కున కాల్ కట్ చేశాను.


అప్పటివరకు నాకు క్యాస్టింగ్ కౌచ్ అంటే ఏంటో తెలియదు. ఇండస్ట్రీలో నా తండ్రి ఉండడం అదృష్టం. అప్పటివరకు ఇలాంటి ఇబ్బందులు ఉంటాయన్న మాటే కానీ, నెప్పుడు అనుభవించలేదు. ఇక నా వరకు వచ్చాక తెలిసింది' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జామీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక జామీ వ్యాఖ్యలు విన్న నెటిజన్స్.. బయటవారికే కాదు .. స్టార్ వారసులకు కూడా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఉంటాయా.. ఆశ్చర్యంగా ఉందే అని కామెంట్స్ పెడుతున్నారు.

Pawan Kalyan: ఫ్యాన్స్ ను ఇలా రెచ్చగొట్టడం నీకు తగునా పవన్

Nara Rohit: పుట్టిన రోజు సందర్భంగా 'సుందర కాండ' రిలీజ్ డేట్

Updated Date - Jul 25 , 2025 | 05:35 PM