సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vijay Sethupathi Son: సూర్య ఫీనిక్స్ వచ్చేస్తోంది...

ABN, Publish Date - Jun 27 , 2025 | 03:52 PM

జూలై 4న రాబోతున్న 'ఫీనిక్స్' చిత్రంతో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి కుమారుడు సూర్య హీరోగా పరిచయం అవుతున్నాడు. గతంలో కొన్ని చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేసిన సూర్యకు హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ఇదే.

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కుమారుడు సూర్య (Surya) సేతుపతి హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'ఫీనిక్స్' (Phoenix). ఏకే బ్రేవ్‌మ్యాన్ పిక్చర్స్ ఈ సినిమాని సమర్పిస్తోంది. జూలై 4న ఈ చిత్రం గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, యాక్షన్‌తో పాటు భావోద్వేగాలను మిళితం చేస్తూ, కొత్త హీరోకి సరైన లాంచింగ్ మూవీగా వుండబోతోంది.


'ఫీనిక్స్' సినిమాకి సామ్ సిఎస్ (Sam CS) సంగీతాన్ని అందిస్తున్నారు. వెల్‌రాజ్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్. టెక్నికల్ క్రూ బలంగా ఉండటంతో, 'ఫీనిక్స్‌'పై అంచనాలు పెరిగాయి. గతంలో సూర్య సేతుపతి 'నానుమ్ రౌడీ దాన్, సిందుబాద్' వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. అయితే హీరోగా అతనికి 'ఫీనిక్స్' తొలి చిత్రం. తాజాగా ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ “ఇంధ వంగికో” విడుదలైంది. విజయ్ సేతుపతి ఈ పాటను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. బాబా భాస్కర్ (Baba Bhaskar) కొరియోగ్రఫీ, వెల్‌రాజ్ అందించిన కలర్ ఫుల్ విజువల్స్, సూర్య సేతుపతి ఎనర్జిటిక్ డ్యాన్స్ తో పాట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Also Read: Kannappa Review: కన్నప్ప మూవీ రివ్యూ

Also Read: Viraatapalem Thriller Series Review: విరాట పాలెం వెబ్ సీరిస్ రివ్యూ

Updated Date - Jun 27 , 2025 | 04:15 PM