Suriya: జీతూ మాధవన్‌తో సూర్య సినిమా..
ABN , Publish Date - Aug 24 , 2025 | 02:14 PM
సూర్య ఇప్పుడు మరోసారి తనకి బాగా కలిసొచ్చిన ఖాకీ కథతో అలరించడానికి సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ మీడియా చెబుతుంది.
తమిళ స్టార్ హీరో సూర్యకు (Suriya) పోలీస్ క్యారెక్టర్స్ బాగా కలిసొచ్చాయి. ఆయన నటించిన ‘సింగం’ (Singham) సిరీస్ సినిమాలు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ సూపర్‌హిట్ సొంతం చేసుకున్నాయి. సూర్య ఇప్పుడు మరోసారి తనకి బాగా కలిసొచ్చిన ఖాకీ కథతో అలరించడానికి సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ మీడియా చెబుతుంది. త్వరలో ఆయన నటించబోతున్న 47వ (Suriya 47) చిత్రం ఈ తరహా కథాంశంతోనే సాగనుందని తెలిసింది. మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కించనున్నారని టాక్ నడుస్తోంది. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించనుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ పొడక్షన్స్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని ఈ ఏడాదిలోనే సినిమా ప్రారంభం కానుందని సమాచారం.
ALSO READ: Ramayana-Namit malhotra: నచ్చకపోతే మా ఫెయిల్యూర్‌గానే భావిస్తాం
ఇటీవల సూర్య నుంచి వచ్చిన కంగువా, రెట్రో చిత్రాలు నిరాశనే మిగిల్చాయి. ప్రస్తుతం మంచి హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు సూర్య. తనకు బాగా కలిసిన పోలీస్ నేపథ్యంలో సినిమా ఈసారి తప్పకుండా హిట్ ఇస్తుందనే అభిమానులు భావిస్తున్నారు.
ALSO READ: Sankar Kumar: ప్రముఖ కార్టూనిస్ట్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ శంకు కన్నుమూత
Bad Girlz: సిద్ శ్రీరామ్.. మరోసారి అదరగొట్టాడుగా! ఇలా చూసుకుంటానే.. లిరికల్ వీడియో సాంగ్
Madharaasi: బక్కోడు.. మరో పాటతో వచ్చాడు! వర...వర వరదల్లే వీడియో సాంగ్