Madharaasi: బ‌క్కోడు.. మ‌రో పాట‌తో వ‌చ్చాడు! వ‌ర‌...వ‌ర వ‌ర‌ద‌ల్లే వీడియో సాంగ్‌

ABN , Publish Date - Aug 24 , 2025 | 11:22 AM

శివ కార్తికేయ‌న్ మ‌ద‌రాసి నుంచి వ‌ర‌త‌ల్లే అనే సాంగ్‌ను మేక‌ర్స్ ఆదివారం విడుద‌ల చేశారు.

Madharaasi

శివకార్తికేయన్ (Siva Karthikeyan) హీరోగా రుక్మిణీ వ‌సంత్ (Rukmini Vasanth) హీరోయిన్‌గా సౌత్ టాప్ డైరెక్ట‌ర్ ముర‌గ‌దాస్ (A.R.Murugadoss) రూపొందించిన చిత్రం మ‌ద‌రాసి (Madharasi). అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్‌5న త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ప్రారంభించారు.

ఇందులో భాగంగా ఆదివారం ఉద‌యం ఈ సినిమా నుంచి వ‌ర వ‌ర వ‌ర‌ద‌ల్లే అంటూ సాగే పాట‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. రామ జోగ‌య్య శాస్తి (Ramajogayya Sastry) ఈ పాట‌కు సాహిత్యం అందించ‌గా అనిరుధ్ ర‌విచంద‌ర్ (Anirudh Ravichander) సంగీతంలో ఆదిత్య (Adithya RK) ఆల‌పించాడు. ఈ సాయంత్రం సినిమా ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు.

Updated Date - Aug 24 , 2025 | 12:42 PM