Bad Girlz: సిద్ శ్రీరామ్.. మరోసారి అదరగొట్టాడుగా! ఇలా చూసుకుంటానే.. లిరికల్ వీడియో సాంగ్
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:13 PM
సిద్ శ్రీరామ్ గాత్రంలో తాజాగా ఇలా చూసుకుంటానే.. లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది.
రెండేండ్ల క్రితం ప్రదీప్ మాచిరాజుతో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా వంటి హఙట్ చిత్రం రూపొందించిన మున్నా ధూళిపూడి (Munna) మలి ప్రయత్నంగా దర్శకత్వం వహించిన చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’ (Bad Girls) ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. రోహన్ సూర్య (Rohan Surya), మోహి (Mohi) హీరోలుగా నటిస్తోండగా తెలుగమ్మాయి బృంద ఫేమ్ యష్ణ ముత్తులూరి (Yashnae Muthuluri), కన్నడ ముద్దుగుమ్మలు అంచల్ గౌడ (Anchal Gowda), పాయల్ చెంగప్ప(Payal chengappa), రోషిణి (Roshni Sahota) కథానాయుకలుగా నటించారు. నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రాన్నీ నిర్మించారు.
అయితే.. ఇప్పటికే చిత్రీరణ జరుపుకున్న ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈనేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి ఇలా చూసుకుంటానే (Ila Chusukuntane) అంటూ తన ప్రేమికురాలిని ఎలా చూసుకుపోయేది వివరించే పాటను విడుదల చేశారు. ఈ గేయానికి అస్కార్ విన్నర్ చంద్రబోస్ (chandra bose) సాహిత్యం అందించగా అనూప్ రూబెన్స్ (Anup Rubens) సంగీతంలో ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ (Sid Sriram) ఆలపించాడు. ఈ పాట సైతం ఈ మేకర్స్ సినమా నుంచి వచ్చిన 'నీలి నీలి ఆకాశం' పాట తరహాలోనే వినసొంపుగా ఉండడం విశేషం.