Shalini Pandey: ఈసారైనా షాలినికి అదృష్టం కలిసొస్తుందా..
ABN, Publish Date - Sep 27 , 2025 | 10:08 AM
‘అర్జున్‌రెడ్డి’ చిత్రంతో పాపులారిటీ తెచ్చుకుంది జబల్‌పూర్ బ్యూటీ శాలినీ పాండే. ఆ తర్వాత ‘మహానటి’తో సుశీల పాత్రతోనూ మెప్పించింది.
‘అర్జున్‌రెడ్డి’ (Arjun Reddy0 చిత్రంతో పాపులారిటీ తెచ్చుకుంది జబల్‌పూర్ బ్యూటీ శాలినీ పాండే (Shalini Panday). ఆ తర్వాత ‘మహానటి’తో సుశీల పాత్రతోనూ మెప్పించింది. తదుపరి వచ్చిన తెలుగు, హిందీ బాషల్లో వచ్చిన ఏ చిత్రమూ ఆమెకు విజయాన్ని అందించలేదు. ఆమె నటించిన చిత్రాలు వరుసగా విడుదలవుతున్నప్పటికీ ఆమెకు సరైన బ్రేక్ లభించలేదు. తమిళంలో వచ్చిన ‘100 శాతం కాదల్’ బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. అయితే, ఆమె నటనా ప్రతిభను గుర్తించిన దర్శక నటుడు ధనుష్... తన స్వీయ నిర్మాణంలో రూపొందించిన ‘ఇడ్లీకడై’లో మరోమారు అవకాశం ఇచ్చారు.
ఇందులో మరో ముఖ్య పాత్ర పోషించిన అరుణ్ విజయ్‌కు జోడీగా షాలిని పాండే నటించారు. దీంతో కోలీవుడ్‌లో మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రస్తుతం ఆమె హిట్టు కోసం ఈ చిత్రం మీదే గంపెడాశలు పెట్టుకుంది. ధనుష్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ALSO READ: Saturday Tv Movies: శనివారం, Sep 27.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా
OG Movie: ఓజీ.. ఇక ముందు కష్టమే
Little Hearts OTT: కాత్యాయనీ.. ఓటీటీకి వస్తుందిరోయ్
OG Mania: 'ఓజీ' థీమ్ హుడీతో మెస్మరైజ్