OG Mania: 'ఓజీ' థీమ్ హుడీతో మెస్మరైజ్

ABN , Publish Date - Sep 26 , 2025 | 05:53 PM

ఒక్క ఫోటో ఓజీ క్రేజీ ని మరో పీక్ స్టేజ్ కి తీసుకెళ్ళింది.. ఒక్క వ్యక్తి రాక అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది. హీరో కంటే కూడా ఆ వ్యక్తి రావడం వారికి చెప్పలేని సంతోషాన్ని కలిగించింది. ఇంతకీ ఎవరు ఆ స్పెషల్ గెస్ట్ అనుకుంటున్నారా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ 'ఓజీ' (OG) సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్‌గా విడుదలై, థియేటర్లలో ఒక్కసారిగా పండగ వాతావరణాన్ని సృష్టించింది. సుజీత్ (Sujeeth ) డైరెక్షన్‌లో, డీవీవీ దానయ్య (D. V. V. Danayya) నిర్మాణంలో తెరకెక్కిన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్లో పవన్ కళ్యాణ్‌ రిటైర్డ్ గ్యాంగ్‌స్టర్ ఓజస్ రోల్ లో అదరగొట్టాడు. ఇక బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హాష్మీ (Emraan Hashmi )విలన్‌గా కనిపించి మరింత హైప్ తీసుకొచ్చాడు. ఇంకా తమన్ బీజీఎం ఈ సినిమాకు మరింత ఫైర్ జోడించింది. అంతేకాక ఫ్యాన్స్ నే కాదు టాలీవుడ్ హీరోస్ ను సైతం థియేటర్లకు క్యూలు కట్టేలా చేసింది. సెలబ్రిటీలు అర్ధరాత్రి ప్రీమియర్ షోలకు పరిగెత్తారు. ఈ క్రమంలో అభిమానులని ఆకర్షించే ఓ సూపర్ సీన్ జరిగింది.


మెగా ఫ్యామిలీ కూడా 'ఓజీ' క్రేజ్‌కు ఎంబ్రేస్ అయింది. మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ (Sai Durgha Tej) , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej ) , పవన్ కళ్యాణ్ సినిమా చూడటానికి థియేటర్లకు వెళ్లి జోష్ నింపారు. అంతేకాదు ఈ సారి మరో ప్రత్యేకత కూడా కనిపించింది. పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ (Akira Nandan), కూతురు ఆద్య (Aadya) కూడా ప్రీమియర్ షోకు వెళ్లి, ఫ్యామిలీ మూమెంట్ క్రియేట్ చేశారు. ఇద్దరూ థియేటర్‌కు వెళ్లిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టుతున్నాయి. ముఖ్యంగా, ఆద్య ఓజీ థీమ్‌తో హుడీ వేసుకుని కనిపించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రేణు దేశాయ్ (Renu Desai ) తన సోషల్ మీడియా పేజీలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టగా అది వైరల్ గా మారింది.

ఆద్య, అకీరాతో కలిసి ఓజీ చూడటానికి ఎక్సైటెడ్‌గా వెళ్లడం చూసి తాను సూపర్ హ్యాపీగా ఉన్నానని తెలిపింది. ఆమె ఇంత ఎదిగిపోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్‌తో పాటు అకీరా-ఆద్య ఫోటోలు, ఆద్య హుడీ లుక్ పిక్స్ నెట్‌ని షేక్ చేస్తున్నాయి. ఫ్యాన్స్ ఈ ఫ్యామిలీ బాండింగ్‌ని చూసి ఖుషీ అవుతున్నారు. మొత్తంగా ఈసారి ఆద్య ఓజీకి మరింత స్పెషల్ క్రేజీలు తీసుకొచ్చిందని అభిమానులు చెప్పుకుంటున్నారు. మరోవైపు ఈ సినిమాను చూసి కొంత మంది డైహార్ట్ ఫ్యాన్స్ చొక్కాలు చించేసుకుంటున్నారు... అందుకే ఎక్స్ ట్రా టీషర్ట్ తెచ్చుకోవాలంటూ ప్రసాద్ మల్టీఫెక్ట్స్ జారీ చేసిన వినూత్న ప్రకటన వైరల్ గా మారింది.

Read Also: Jockey: గోట్ ఫైట్ నేపథ్యంలో వస్తున్న జాకీ

Read Also : Siddu Jonnalagadda: మగాడి విషయంలో సొసైటీ అన్యాయంగా ప్రవర్తిస్తుంది

Updated Date - Sep 26 , 2025 | 06:35 PM