Little Hearts OTT: కాత్యాయనీ.. ఓటీటీకి వస్తుందిరోయ్

ABN , Publish Date - Sep 26 , 2025 | 09:35 PM

సోషల్ మీడియా స్టార్ మౌళీ తనూజ్ (Mouli Thanuj), శివాని నగారం(Shivani Nagaram) జంటగా సాయి మార్తాండ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లిటిల్ హార్ట్స్ (Little Hearts).

Little Hearts OTT

Little Hearts OTT: సోషల్ మీడియా స్టార్ మౌళీ తనూజ్ (Mouli Thanuj), శివాని నగారం(Shivani Nagaram) జంటగా సాయి మార్తాండ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లిటిల్ హార్ట్స్ (Little Hearts). ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన లిటిల్ హార్ట్స్ దాదాపు రూ. 33 కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. అదే రోజు రిలీజ్ అయిన ఘాటీ, మదరాసి లాంటి పెద్ద సినిమాలను కూడా పక్కకు నెట్టి లిటిల్ హార్ట్స్ భారీ విజయాన్ని అందుకుంది.


ఇక ఈ సినిమాను కేవలం అభిమానులు మాత్రమే కాకుండా స్టార్స్ కూడా ప్రశంసించారు. నిబ్బానిబ్బిలా లవ్ స్టోరీలోనే కాస్తా కామెడీ జోడించి అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ సాయి మార్తాండ్. ఇక ఈ సినిమాలోని సాంగ్స్.. ముఖ్యంగా కాత్యాయనీ.. భోంచేశావా.. ? ఒరేయ్ అఖిల్ ఇదేమి పాటరా.. ? అంటూ వచ్చే లైన్స్, కాత్యాయనీ నన్ను లవ్ చేయవే సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటీటీలో వస్తుందా అని ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసారు. ఎట్టకేలకు ఆ ఎదురుచూపులకు తెరపడింది.


నెల తిరక్కుండానే లిటిల్ హార్ట్స్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాను నిర్మించిందే ఈటీవీ విన్ కాబట్టి. ఆ ఓటీటీలోనే లిటిల్ హార్ట్స్ స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 1 నుంచి ఈటీవీ విన్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ అధికారికంగా తెలిపారు. అంతేకాకుండా ఇంకో సర్ ప్రైజ్ కూడా ఇచ్చారు. ఓటీటీలో అదనపు సీన్స్ ను కూడా యాడ్ చేసి ఎక్స్టెండేడ్ కట్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఇక దీంతో ఫ్యాన్స్ మరోసారి అదనపు సీన్స్ కోసం లిటిల్ హార్ట్స్ ను ఓటీటీలో చూడడానికి సిద్ధమవుతున్నారు. మరి ఈ చిత్రం థియేటర్ లో చేసిన రచ్చను ఓటీటీలో కూడా కొనసాగిస్తుందా అనేది తెలియాలి.

NTR: కాంతార కోసం బయటకు వస్తున్న ఎన్టీఆర్..

Thamma Trailer: భయపెడుతున్న రష్మిక థామా ట్రైలర్..

Updated Date - Sep 26 , 2025 | 09:35 PM