OG Movie: ఓజీ.. ఇక ముందు కష్టమే
ABN , Publish Date - Sep 26 , 2025 | 10:02 PM
ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే.. అని ఓజీ (OG) మేకర్స్ అనుకుంటూ ఉంటారు అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. నిజంగానే ఓజీ విషయంలో ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది.
OG Movie: ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే.. అని ఓజీ (OG) మేకర్స్ అనుకుంటూ ఉంటారు అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. నిజంగానే ఓజీ విషయంలో ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓజీ. ఎన్నో అంచనాల నడుమ నిన్న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. పవర్ స్టార్ కెరీర్ లోనే రికార్డ్ కలక్షన్స్ అందుకుంది. ఇప్పటివరకు పవన్ అందుకొని వంద కోట్ల రికార్డ్ ను ఒక్కరోజులోనే అందుకునేలా చేసింది. ఒక్కరోజులోనే రూ. 154 కోట్లు సాధించి సెన్సేషన్ సృష్టించింది.
అయితే ఈ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. పవన్ సినిమా, పెద్ద సినిమా అని టికెట్ రేట్లు పెంచుకోమని తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెల్సిందే. పదిరోజుల వరకు అవే టికెట్ రేట్లు ఉంటాయి.. కనీసంలో కనీసం రూ. 300 కోట్లు సాధించొచ్చు అనుకున్నారు. కానీ, ఈలోపే మేకర్స్ కు షాక్ తగిలింది. ఈ జీవోను రద్దు చేస్తూ హైకోర్ట్ తీర్పునిచ్చింది. ఒక వ్యక్తి వేసిన పిటిషన్ కారణంగా న్యాయస్థానం.. టికెట్ రేట్లను పెంచడం కుదరదని తీర్పు ఇచ్చింది.
ఇక ఓజీ మేకర్స్.. ఆ తీర్పుపై మరోసారి పిటిషన్ వేసింది. టికెట్ రేట్లు పెంచడం ఎంత అవసరమో చెప్పుకొచ్చింది. అయితే తాజా విచారణలో హైకోర్టు మొదట ఇచ్చిన నిర్ణయంలో మార్పు లేదని స్పష్టం చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని, టికెట్ రేట్ల పెంపుకు ఇప్పటికీ అనుమతి లేదని క్లారిటీ ఇచ్చింది. దీంతో మేకర్స్ కు గట్టి షాక్ తగిలిందనే చెప్పొచ్చు. ఇప్పటివరకు టికెట్ రేట్లు అధికం కాబట్టి ఈ రేంజ్ కలక్షన్స్ వచ్చాయి. ఇకనుంచి ఆ రేట్లు లేవు అంటే ఓజీ.. ముందు ముందు అనుకున్న టార్గెట్ ను ఫినిష్ చేయడం చాలా అంటే చాలా కష్టం.
ఓజీ రెండో రోజు నుంచి లెక్కలు మారనున్నాయి. ఓజీ హైప్ ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెల్సిందే. ఇప్పటివరకు ఫ్యాన్స్ లెక్క అయ్యింది. ఇకనుంచి ఓజీకి అసలు పరీక్ష మొదలుకానుంది. మరి ఈ పరీక్షలో ఓజీ నెగ్గుతాడా.. ? అనుకున్న టార్గెట్ ను రీచ్ అవుతాడా.. ? అనేది చూడాలి.
Little Hearts OTT: కాత్యాయనీ.. ఓటీటీకి వస్తుందిరోయ్
NTR: కాంతార కోసం బయటకు వస్తున్న ఎన్టీఆర్..