Tribandhari Barbarik: చిరంజీవి బర్త్ డే కన్నారు... ఇప్పుడు వెనక్కి వెళుతున్నారు...

ABN , Publish Date - Aug 18 , 2025 | 05:15 PM

'త్రిబాణధారి బార్బరిక్' సరైన థియేటర్లు దొరకని కారణంగా ఓ వారం ఆలస్యంగా ఆగస్ట్ 29న విడుదల కాబోతోంది.

Tribandhari Barbarik Movie

సత్యరాజ్ (Satyaraj) కీలక పాత్ర పోషించిన 'త్రిబాణధారి బార్బరిక్' (Tribandhari Barbarik) మూవీని చిరంజీవి (Chirajeevi) బర్త్ డే కానుకగా ఆగస్ట్ 22న విడుదల చేయబోతున్నామని మేకర్స్ అప్పట్లో తెలిపారు. అయితే ఇప్పుడు సరైన థియేటర్లు దొరకని కారణంగా ఓ వారం ఆలస్యంగా ఈ సినిమా ఆగస్ట్ 29న విడుదల చేయబోతున్నామని తెలిపారు.


ఈ సందర్భంగా చిత్ర నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదెల మాట్లాడుతూ, 'ఓ సినిమాను తెరకెక్కించడం కంటే సరైన రిలీజ్ టైం, కావాల్సినన్ని థియేటర్లను బ్లాక్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లడమే గొప్ప విషయం. సరైన రిలీజ్ డేట్ దొరికి.. అనుకునన్ని థియేటర్లు లభిస్తే.. భారీ రిలీజ్ దక్కితే ఆ చిత్రానికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మంచి రిలీజ్ డేట్ కోసం చూసి మా ‘త్రిబాణధారి బార్బరిక్’ను ఆగస్ట్ 29న భారీగా విడుదల చేయబోతున్నాం' అని అన్నారు.

tb copy.jpg


స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మిస్తున్న ఈ సినిమాను మోహన్ శ్రీవత్స డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో పాన్ ఇండియన్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రను పోషించగా, వశిష్ట ఎన్ సింహా (Vashishta N. Simha), 'సత్యం' రాజేష్ (Satyam Rajesh), ఉదయభాను (Udaya Bhanu), క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ కీలక పాత్రల్ని పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్ ఇలా అన్నీ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ట్రైలర్ ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. విజువల్స్, ఆర్ ఆర్ ఇలా అన్నీ కూడా ఆకట్టుకున్నాయి. మోహన్ శ్రీవత్స మేకింగ్, ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్ సంగీతం ఇప్పటికే అందరిలోనూ ఆసక్తి పెంచేసింది. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి మొదటి ప్రాజెక్ట్ అయినా కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున నిర్మించారని దర్శకుడు మోహన్ తెలిపారు.

Also Read: Soothravakyam OTT: ఆ ఓటీటీల్లోకి.. అదిరిపోయే థ్రిల్ల‌ర్‌! అబ్బాయి మిస్సింగ్ కేసుకు వెళితే.. బయటపడ్డ అమ్మాయి మర్డర్

Also Read: Mahavathar Narasimha: ఐదుగురు స్టార్ హీరోల పోటీ తట్టుకుని...

Updated Date - Aug 18 , 2025 | 05:19 PM

Tribanadhari Barbarik: క‌ట్ట‌ప్ప ఇర‌గ‌దీశాడుగా.. బార్బరిక్’ ట్రైల‌ర్ అదిరింది

Tribanadhari Barbarik: భీముడు మనవడు, ఘటోత్కచుడు కుమారుడిపై చిత్రం..

Tribanadhari Barbarik: మాస్ నంబర్ లో ఉదయభాను...

Tribanadhari Barbarik: స్వీయ నాశనానికి మూడు మార్గాలు..

Tribandhari Barbariq: చిరంజీవి పుట్టినరోజున విడుదల