Tribanadhari Barbarik: మాస్ నంబర్ లో ఉదయభాను...

ABN , Publish Date - Aug 02 , 2025 | 05:16 PM

'త్రిబాణధారి బార్బరిక్' చిత్రంలో నటి ఉదయభాను ఓ మాస్ నంబర్ లో నటించి, అలరించింది. ఆ పాటను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు.

Tribanadhari Barbarik Movie

వెర్సటైల్ యాక్టర్ సత్యరాజ్ (Satyaraj) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్‌’ (Tribanadhari Barbarik). కొత్త పాయింట్, సరికొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు మారుతి (Maruthi) సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్ రెడ్డి అడిదాల నిర్మిస్తున్నారు. మోహన్ శ్రీవత్స దీనికి దర్శకుడు.


తాజాగా 'త్రిబాణధారి బార్బరిక్' మూవీ నుండి ఓ మాస్ నంబర్‌ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ స్పెషల్ సాంగ్‌లో ఉదయ భాను (Udaya Bhanu) అందరినీ ఆకట్టుకున్నారు. 'ఇస్కితడి ఉస్కితడి' అంటూ సాగే ఈ పాటను రఘురామ్ రచించగా, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఇంఫ్యూజన్ బ్యాండ్ ఇచ్చిన బాణీకి బీ, సీ సెంటర్లు ఊగిపోయేలా పాట ఉంది. ఇందులో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ‘నీ వల్లే నీ వల్లే’, 'అనగనగా కథలా', 'బార్బరిక్ థీమ్ సాంగ్' అందరినీ మెప్పించాయి. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ఇందులో సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, క్రాంతి కిరణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Updated Date - Aug 02 , 2025 | 05:16 PM