Tribandhari Barbariq: చిరంజీవి పుట్టినరోజున విడుదల

ABN , Publish Date - Aug 06 , 2025 | 02:37 AM

సత్యరాజ్‌ ప్రధాన పాత్రలో మోహన్‌ శ్రీవాత్సవ తెరకెక్కించిన చిత్రం త్రిబాణధారి బార్బరిక్‌ దర్శకుడు మారుతి

సత్యరాజ్‌ ప్రధాన పాత్రలో మోహన్‌ శ్రీవాత్సవ తెరకెక్కించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్‌’. దర్శకుడు మారుతి సమర్పణలో విజయ్‌పాల్‌ రెడ్డి అడిదెల నిర్మించారు. వశిష్ట ఎన్‌.సింహా, ఉదయభాను, ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో సత్యరాజ్‌ మాట్లాడుతూ ‘మెగాస్టార్‌ చిరంజీవి గొప్ప నటుడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈనెల 22న సినిమా విడుదలవుతుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

Updated Date - Aug 06 , 2025 | 02:37 AM