సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sai Pallavi: బికినీలో సాయి పల్లవి.. చీర కట్టుకొని స్విమ్ చేస్తారా

ABN, Publish Date - Sep 23 , 2025 | 06:30 PM

ఏఐ వచ్చాకా ఏది నిజమో ఏది అబద్దమో చెప్పడం చాలా కష్టంగా మారింది.

Sai Pallavi

Sai Pallavi: ఏఐ వచ్చాకా ఏది నిజమో ఏది అబద్దమో చెప్పడం చాలా కష్టంగా మారింది. అసలు ఆ ఫొటోలో ఉన్నవారు చూసినా కూడా అది ఒరిజినలా.. ఫేక్ నా అని కనిపెట్టడం కష్టం అన్న రీతిలో ఏఐ ఫోటోలను క్రియేట్ చేస్తున్నారు. దీని వలన ఎంతోమంది సెలబ్రిటీలు తమ పేరును, పరువును పోగొట్టుకుంటున్నారు. గత రెండు రోజులుగా లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి (Sai Pallavi) బికినీ ఫోటోలు అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు హల్చల్ చేశాయి.


ఇప్పటివరకు గ్లామర్ ఒలకబోయని సాయిపల్లవి సడెన్ గాస్విమ్ సూట్ లో, బికినీలో కనిపించడంతో అందరు షాక్ అయ్యారు. ఇది నిజమా.. అబద్దమా అని డైలమాలో పడ్డారు. అయితే కొందరు మాత్రం ఏది నిజం ఏది అబద్దం అని తెలుసుకోకుండా.. ఆమెపై ట్రోల్స్ వేయడం మొదలుపెట్టేశారు. ఇప్పటివరకు చీరల్లో.. పద్దతిగా కనిపించిన ఆమె.. ఐపీడు బికినీలో కనిపించింది.. ఇదే ఆమె నిజ స్వరూపం. ఇండస్ట్రీలో ఆమె కనిపించేది అబద్దమని విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా రామాయణలో సీత పాత్ర ఇలాంటి హీరోయిన్ చేస్తే చెడ్డపేరు వస్తుందని, ఆమెను ఆ సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.


ఇక ఈ విమర్శలపై సాయిపల్లవి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఏవి నిజమైన ఫోటోలు.. ఏవి మార్ఫ్ చేసిన ఫోటోలు అనేది కూడా తెలియకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడడమేనా. సాయిపల్లవి చెల్లి పూజా కన్నన్ ఈ ఫోటోలను షేర్ చేసిన మాట వాస్తవమే. కానీ, ఆ ఫోటోలలో సాయిపల్లవి బికినీ, స్విమ్ సూట్ లో కనిపించలేదు. కేవలం ముఖం మాత్రమే కనిపించేలా ఆమె ఫోటోలు పెట్టింది. వాటిని కొందరు ఏఐ సహాయంతో బికినీ వేసుకున్నట్లు, స్విమ్ సూట్ వేసుకున్నట్లు మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.


ఇక అంతేకాకుండా ఎవరైనా బీచ్ కి వెళ్లినా.. స్విమ్ చేయడానికి వెళ్ళినప్పుడు చీరలు కట్టుకొని స్విమ్ చేస్తారా.. ? కుటుంబంతో కలిసి వెకేషన్ కు వెళ్ళినప్పుడు వారికి నచ్చిన బట్టలు వేసుకుంటారు. అవేమి అందరితో షేర్ చేయలేదు కదా. మార్ఫ్ చేసి ఆమె పేరును దెబ్బతీయడానికే ట్రోలర్స్ ఇలా చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. ఇకపోతే ఇప్పటివరకు సాయిపల్లవి ఈ ఫోటోలపై స్పందించలేదు. మరి ముందు ముందు ఏమైనా స్పందిస్తుందా.. అవసరం లేదని వదిలేస్తుందా.. ? అనేది చూడాలి.

Kalyani Priyadarshan: రూమర్స్‌పై స్పందించిన మలయాళ బ్యూటీ..

Kantar1 Trailer : కాంతార-1 ట్రైలర్... 24 గంటల్లో 107 మిలియన్ వ్యూస్

Updated Date - Sep 23 , 2025 | 06:30 PM