Kalyani Priyadarshan: రూమర్స్‌పై స్పందించిన మలయాళ బ్యూటీ..

ABN , Publish Date - Sep 23 , 2025 | 05:30 PM

‘కొత్త లోక’ సినిమాతో సూపర్‌ సక్సెస్‌ అందుకున్నారు నటి కల్యాణి ప్రియదర్శన్‌. చిత్రంతో ఆమె నటనకు అభిమానులు, సినీ ప్రియులు సోషల్‌ మీడియా వేదికగా అభినందిస్తున్నారు.

Kalyani Priyadarshini

‘కొత్త లోక’ (Kotha loka) సినిమాతో సూపర్‌ సక్సెస్‌ అందుకున్నారు నటి కల్యాణి (Kalyani Priyadarshan)ప్రియదర్శన్‌. చిత్రంతో ఆమె నటనకు అభిమానులు, సినీ ప్రియులు సోషల్‌ మీడియా వేదికగా అభినందిస్తున్నారు. తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కల్యాణిపై ఓ వెబ్‌సైట్‌ పోస్టు పెట్టగా ఆమె  స్పందించారు. ఆ కథనాన్ని ఆమె ఖండించారు. ‘జీవితమంటే ఏంటో మాకు తెలియాలన్న ఉద్దేశంతో మా పేరెంట్స్‌ నన్ను, నా సోదరుడిని వియత్నాంలోని అనాథాశ్రమంలో వారంపాటు ఉంచారు. అదో గొప్ప అనుభవం. జీవితాంతం గుర్తుండిపోయే పాఠం’’ అని కల్యాణి చెప్పినట్టుగా సదరు వెబ్‌సైట్‌ రాసింది. ‘ఈ మాట నేనెప్పుడూ అనలేదు. దయచేసి ఇలాంటి అసత్య ప్రచారాలు ఆపండి’ అని ఆమె విజ్ఞప్తి చేశారు. దర్శకుడు పియదర్శన్‌ కూతురు అయిన కల్యాణి  ‘హలో’తో  నటిగా ప్రయాణం మొదలుపెట్టింది. ఆ తర్వాత ‘చిత్రలహరి’లో మెరిసింది. ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు. మలయాళం, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఫాంటసీ కథతో లేడీ ఓరియెంటెడ్‌ సినిమాగా డొమినిక్‌ అరుణ్‌ ‘కొత్త లోక’ను తెరకెక్కించారు. ఆగస్టు 28న విడుదలైన ఈ సినిమా పెద్ద హిట్‌ అయింది. ఇప్పటి వరకూ రూ.270 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి మలయాళ సినీ చరిత్రలో  అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది

Updated Date - Sep 23 , 2025 | 05:31 PM