Kantar1 Trailer : కాంతార-1 ట్రైలర్... 24 గంటల్లో 107 మిలియన్ వ్యూస్
ABN , Publish Date - Sep 23 , 2025 | 05:19 PM
ఆడియెన్స్ కు కర్ణాటక హైకోర్టు షాక్ ఇచ్చింది. సినిమా రేట్ల తగ్గింపునకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బ్రేకులు వేసింది. తుదితీర్పు వచ్చేవరకు ప్రస్తుత రేట్లతోనే టికెట్ల అమ్మకం కొనసాగించాలని చెప్పింది.
కర్ణాటక లో సినిమా రేట్ల తగ్గింపు మళ్లీ మొదటికి వచ్చింది. ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్తర్వులపై అక్కడి హైకోర్టు విధించింది. రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్లలో సినిమా టికెట్ రేటు గరిష్టంగా ₹200కే ఉండాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. దీని ప్రకారం. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలు ₹120 నుంచి ₹200 మధ్యలో ఉంటాయి. ఇక IMAX, 4DX, ICE స్క్రీన్లున్న మల్టీప్లెక్స్లు ₹236 వరకూ తీసుకోవచ్చు . అలాగే 75 కంటే తక్కువ సీట్లున్న మల్టీప్లెక్స్‌కు ఇంకా ఎక్కువ రేటు వసూలు చేసే ఛాన్స్ ఇచ్చారు. అయితే ఈ నిబంధనలు సవాలు చేస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాయి.
అన్ని థియేటర్లకూ ఒకే రేటు ఫిక్స్ చేయడం సరికాదని.. థియేటర్ టైప్, సౌకర్యాలు, ప్రేక్షకుల ఛాయిస్ బట్టి రేట్లు ఉండాలని వాదించారు. మల్టీప్లెక్స్ కు ఖర్చు ఎక్కువని.. చిన్న 'ప్రీమియం' థియేటర్ల గురించి స్పష్టమైన క్లారిటీ లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా కర్ణాటక హైకోర్టు ఈ ఆర్డర్డ్ పై స్టే ఇచ్చింది. జస్టిస్ రవి వి. హోస్మని, తుది నిర్ణయం తీసుకునే వరకూ థియేటర్లు తమ రేట్లను మామూలుగానే కొనసాగించవచ్చని చెప్పారు.
హైకోర్టు తీర్పుతో ప్రస్తుతానికి థియేటర్ల ఓనర్లకు తాత్కాలిక ఊరట దక్కినట్టయింది. తదుపరి తీర్పు వచ్చేవరకు కర్ణాటకలో థియేటర్లు తమ రెగ్యులర్ రేట్లతోనే టికెట్లు సెల్ చేయొచ్చు. హైకోర్టు నుంచి తర్వాత ఆర్డర్ వచ్చే వరకూ ఈ స్టే కొనసాగుతుంది.ఇదిలా ఉంటే దసరా బరిలో నిలిచిన కాంతార1 కు కలిసి వచ్చేలా కనిపిస్తోంది. దాదాపు 250 కోట్లతో కాంతార1 తెరకెక్కింది. ఇప్పటికే బయటకు వచ్చినే ప్రమోషన్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. తాజాగా విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేసింది. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్, మళయాళ భాషల్లో విడుదలైన ట్రైలర్ ఏకంగా 107 మిలియన్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుని సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది.
Read Also: Pawan Kalyan: ఓజీకి పవన్ వంద కోట్లు.. ఇమ్రాన్ హష్మీకి ఎంతంటే
Read Also: Rithu Chowdary: అర్ధరాత్రుళ్లు మాత్రమే నా ఇంటికి వచ్చి.. నా భర్తతో.. గౌతమీ చౌదరి సంచలన వ్యాఖ్యలు