Rukmini Vasanth: రుక్మిణిని వరిస్తున్న బిగ్ ప్రాజెక్ట్స్
ABN , Publish Date - Aug 18 , 2025 | 07:27 PM
సౌత్ లో కన్నడ కస్తూరి జోరు మామూలుగా లేదు. సినిమాలు రిలీజ్ కాకముందే కొత్త సినిమాలకు సైన్ చేస్తోంది. బ్యూటీ జోరు చూస్తుంటే... రానున్న రోజుల్లో టాప్ ఛైర్ లో కూర్చోవడం ఖాయంగా కనిపిస్తోంది.
రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు సైన్ చేస్తోంది. ఇప్పటికే చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ కమిట్ అయిన మూవీస్ రిలీజ్ కాకముందే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ప్రెజెంట్ పాన్ ఇండియా రేంజ్ లో బిగ్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వస్తే చాలు చిన్నదాని పేరే పరిశీలిస్తున్నారు మేకర్స్.
'బీర్బల్' (Birbal) సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రుక్మిణీ వసంత్, 'సప్త సాగరాలు దాటి' (Sapta Sagaralu Daati ) సినిమాతో యువకుల కలలరాణిగా మారిపోయింది. రక్షిత్ శెట్టి ((Rakshit Shetty) కి జోడిగా నటించిన ఈ వయ్యారి మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. హిందీ 'అప్ స్టైర్స్' లో నటించి మంచి మార్కులే కొట్టేసింది. మొదటి సినిమాలతోనే పాస్ మార్కులు సంపాదించుకోవడంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.
తెలుగు, తమిళ, కన్నడ అని తేడా లేకుండా స్టార్ హీరోస్ తో ఆడిపాడిన ఈ బ్యూటీ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న 'డ్రాగన్' లో నటిస్తున్నట్లు టాక్. ఇదే కాక రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్న 'కాంతార ప్రీక్వెల్'లో, శివకార్తికేయన్ మూవీలో ఈ అందాల చిన్నది నటిస్తోంది. అంతేకాక సుకుమార్ - రామ్ చరణ్ కాంబోలో వస్తున్న సినిమాలో కూడా ఈ అందగత్తెను తీసుకోవాలని అనుకుంటున్నారట. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ ముద్దుగుమ్మను వరించినట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. 'కేజీయఫ్' తో పాన్ ఇండియా స్టార్ గా మారిన యశ్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.
లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్, యశ్ కాంబోలో వస్తున్న 'టాక్సిక్' లో ఛాన్స్ కొట్టేసినట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా లాంటి స్టార్లు ఈ సినిమాలో నటిస్తుండగా... తాజాగా రుక్మిణి పేరు కూడా వినిపిస్తోంది. సీక్రెట్ గా బ్యూటీపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారని... కన్నడ భామ ఎంట్రీ గురించి త్వరలో అధికార ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీంతో ఈ బ్యూటీ ఎలాంటి రోల్ చేయబోతుందన్న క్యూరియాసిటీ నెలకొంది. నిజం చెప్పాలంటే అదృష్ణమంటే రుక్మిణిదే! పూజా , రశ్మికలను సైతం పక్కకు నెట్టి క్రేజీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. పైగా అమ్మడు అంగీకరిస్తున్నవన్నీ వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రాలే కావడం విశేషం.
Also Read: CM Revanth Reddy: భారతీయ సినిమా నిర్మాణ కేంద్రంగా హైదరాబాద్
Also Read: Girija: నాగార్జునతో రికార్డ్ లిప్ లాక్ పెట్టిన హీరోయిన్.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిందేంటి