Rukmini Vasanth: తెలుగులోకి మ‌రో క‌న్న‌డ భామ‌.. ఆ స్టార్ హీరోల‌తో సినిమా! ఇక్క‌డి ప్రేక్ష‌కులు ఫిదా అవ్వాల్సిందే

ABN , Publish Date - Jan 21 , 2024 | 05:51 PM

మ‌రో కన్న‌డ క‌స్తూరి తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్ట‌నుంది. ఇప్ప‌టికే అనుష్క శెట్టి, పూజా హెగ్డే, ర‌ష్మిక మంద‌న్న, కృతి శెట్టి, అమృత అయ్య‌ర్‌, అషిక రంగ‌నాథ్ తెలుగులో విజ‌య‌వంతంగా రాణిస్తుండ‌గా వీరి లిస్టులోకి మ‌రో భామ వ‌చ్చి చేరింది.

Rukmini Vasanth: తెలుగులోకి మ‌రో క‌న్న‌డ భామ‌.. ఆ స్టార్ హీరోల‌తో సినిమా! ఇక్క‌డి ప్రేక్ష‌కులు ఫిదా అవ్వాల్సిందే
rukmini vasanth

మ‌రో కన్న‌డ క‌స్తూరి తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్ట‌నుంది. ఇప్ప‌టికే అనుష్క శెట్టి, పూజా హెగ్డే, ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna), కృతి శెట్టి, అమృత అయ్య‌ర్‌, అషిక రంగ‌నాథ్ (Ashika Ranganath) తెలుగులో విజ‌య‌వంతంగా రాణిస్తుండ‌గా వీరి లిస్టులోకి మ‌రో భామ వ‌చ్చి చేరింది. గ‌త సంవ‌త్స‌రం ర‌క్షిత్ శెట్టి హీరోగా వ‌చ్చిన క‌న్న‌డ డ‌బ్బింగ్ చిత్రం స‌ప్త సాగ‌రాలు దాటి సైడ్ ఏ, సైడ్ బీ ల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ముద్దుగుమ్మ రుక్మిణి వ‌సంత్ (Rukmini Vasanth) ఓ స్ట్రెయిట్ తెలుగు చిత్రంలో ఛాన్స్ ప‌ట్టేసింది. మాస్ మ‌హారాజా ర‌వితేజ (Ravi Teja) , జాతిర‌త్నాలు ఫేం అనుదీప్ (KV Anudeep) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది.

rva.jpeg

ఇప్ప‌టికే క‌న్న‌డ‌లో చేసిన ఆరు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ స్టేట‌స్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్ర‌స్తుతం త‌మిళంలో విజ‌య్ సేతుప‌తితో ఓ సినిమా చేస్తుంది. నెల రోజుల క్రిత‌మే రుక్మిణి (Rukmini Vasanth) ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సినిమాలో క‌థానాయిక‌గా చేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చినా ఎక్క‌డా అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. కానీ ఇప్పుడు ర‌వితేజ ((Ravi Teja)) సినిమాలో సెల‌క్ట్ అయిన‌ట్టుగా తెలుస్తోంది. అదీగాక ఈ సినిమా గురించి, న‌టీన‌టుల గురించి త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది. మ‌రో ఆస‌క్తిక‌ర విష‌య‌మేంటంటే రుక్మిణి విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) సినిమాలోను శ్రీలీల స్థానంలో న‌టిస్తున్న‌ట్లు ఓ న్యూస్ వైర‌ల్ అవుతున్న‌ది.


GEQxB2nbYAAlQMZ.jpeg

స‌ప్త సాగ‌రాలు దాటి సినిమాలో ప్రియురాలిగా, భార్య పాత్ర‌ల్లో రుక్మిణి (Rukmini Vasanth) న‌ట‌న‌కు, ఆమె లుక్స్‌కు తెలుగు ప్రేక్ష‌కులు బాగా క‌నెక్ట్‌ అవ‌డ‌మే కాక ఆ క్యారెక్ట‌ర్‌ను ఫీల్ అయ్యారు. త‌మ ఇండ్ల‌లో ఉండే అమ్మాయిలాగా క‌నిపిస్తూ రుక్మిణి (Rukmini Vasanth) ప్ర‌తి ప్రేక్ష‌కుడిని మెస్మ‌రైజ్ చేయ‌డంతో సినిమా చాలామందిని ట‌చ్ చేస్తుంది. అంతేగాక కొద్ది రోజుల‌పాటు సినిమా మ‌న‌ల్ని హంట్ చేస్తుంది. దీంతో రుక్మిణి తెలుగు చిత్రాలు చేయాల‌ని ఇక్క‌డి ప్రేక్ష‌కులు భావించారు. ఇప్పుడు రుక్మిణి (Rukmini Vasanth) తెలుగు సినిమా చేస్తున్నార‌నే వార్త‌లు రావ‌డంతో అమె అభిమానులు హ్యాపీగా ఫీల‌వుతున్నారు. ఇక్క‌డ టాప్ ప్లెస్‌లోకి రావ‌డం గ్యారంటీ అని అంటున్నారు.

Updated Date - Jan 21 , 2024 | 06:03 PM