సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rashmika Mandanna: 'మైసా'కు జేక్స్ బిజోయ్ సంగీతం...

ABN, Publish Date - Oct 16 , 2025 | 10:44 AM

రశ్మికా మందణ్ణ తాజా చిత్రం 'థామా' దీపావళి కానుకగా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆమె మరో చిత్రం 'మైసా' పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. రవీంద్ర పల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు.

Mysaa movie

నేషనల్ క్రష్ రశ్మిక మందణ్ణ (Rashmika Mandanna) నటిస్తున్న పవర్ ఫుల్, ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ మూవీ 'మైసా' (Mysaa). ఈ సినిమాతో రవీంద్ర పుల్లె (Rawindra Pulle) డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నాడు. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయిలో 'మైసా' సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మేకర్స్ ఒక ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.


నాని నటించిన 'సరిపోదా శనివారం' (Saripooda Sanivaaram) చిత్రానికి సంగీతం అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ ను 'మైసా' చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జేక్స్ బిజోయ్ ట్రైబల్ వాయిద్యాలతో రీరికార్డింగ్ చేస్తున్న వీడియోను రిలీజ్ చేశారు. ఈ సౌండింగ్ అదిరిపోయింది. 'మైసా' మ్యూజికల్ గా గ్రాండ్ స్కేల్ లో వుండబోతుందని ఈ వీడియో చూస్తే అర్థమౌతోంది. 'మైసా' గోండు తెగల బ్యాక్ డ్రాప్ లో హై-ఆక్టేన్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతోంది. రశ్మిక మందణ్ణ ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఇంటెన్స్ అవతార్ లో కనిపించనుంది. ఈ సినిమాకు సూర్య ‘రెట్రో’ సినిమాకి పని చేసిన శ్రేయాస్ పి కృష్ణ డీవోపీగా పని చేస్తున్నారు. యాక్షన్ ని ‘కల్కి 2898 ఏ డీ’ ఫేమ్ ఆండి లాంగ్ డిజైన్ చేస్తున్నారు.

Also Read: Rashmika Mandanna: తెలంగాణ కోడలు పిల్ల.. నల్ల కలువలా విరబూసిందిలా

Also Read: Peddi Movie: దీపావళికి ‘పెద్ది’ ధమాకా.. దర్శకుడు హింట్‌..

Updated Date - Oct 16 , 2025 | 10:47 AM