Rashmika Mandanna: తెలంగాణ కోడలు పిల్ల.. నల్ల కలువలా విరబూసిందిలా
ABN , Publish Date - Oct 15 , 2025 | 09:34 PM
కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా(Rashmika Mandanna) తెలంగాణ పిల్ల ఎప్పుడు అయ్యింది అనుకుంటున్నారా..
Rashmika Mandanna: కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా(Rashmika Mandanna) తెలంగాణ పిల్ల ఎప్పుడు అయ్యింది అనుకుంటున్నారా.. ఈ మధ్యనే నేషనల్ క్రష్.. తెలంగాణ కుర్రాడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెల్సిందే. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. ఆ తరువాత ఈ చిన్నది తెలంగాణ కోడలు పిల్లే అవుతుంది. దీంతో రష్మిక - విజయ్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ముద్దుగుమ్మను ముద్దుగా తెలంగాణ కోడలు పిల్ల అని పిలవడం మొదలుపెట్టారు.
ప్రస్తుతం రష్మిక ఇండస్ట్రీ మొత్తానికి లక్కీ ఛార్మ్ అని చెప్పొచ్చు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో అమ్మడు ఏ సినిమా చేసినా అది హిట్టే అవుతుంది. దీంతో రష్మిక ఏ సినిమా చేసినా దానిపై ఒక రేంజ్ లో హైప్ క్రియే తవుతుంది. ప్రస్తుతం అమ్మడు నటిస్తున్న చిత్రాల్లో థామా ఒకటి. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఆయుష్మాన్ సరసన రష్మిక నటిస్తుంది.
ఇప్పటికే థామా నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ హిందీలోనే కాదు తెలుగులో కూడా మంచి ఆదరణను అందుకున్నాయి. రష్మిక ఈ చిత్రంలో తన అందాలను వేరే లెవెల్ లో ఆరబోసింది. ఈ సినిమాకు హైలైట్ అంటే అమ్మడే అని చెప్పొచ్చు. ఇకపోతే థామా.. అక్టోబర్ 21 న రిలీజ్ కు సిద్దమవుతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం వరుసగా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్ ఇస్తూ సినిమాపై హైప్ ను క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా ఒక ప్రెస్ మీట్ లో రష్మిక బ్లాక్ కలర్ డిజైనర్ లెహంగాలో అదిరగొట్టేసింది. బ్లాక్ లెహంగా పై ఫ్లోరల్ దుపట్టా.. కొప్పు పెట్టి దానికి తెల్ల గులాబీలు అందంగా అలంకరించి అద్భుతంగా తయారయ్యింది. ఈ ఫోటోలను రష్మిక సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. నల్లకలువలా విరబూసిన నేషనల్ క్రష్ అందం నెక్స్ట్ లెవెల్ లో ఉందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో రష్మిక తన విజయ పరంపరను కొనసాగిస్తుందో లేదో చూడాలి.
Prabhutva Sarai Dukanam: టీజర్ మొత్తం బూతులు.. రిలీజ్ కానివ్వం..ఖబర్దార్.
Akira Nandan: సిగ్గేస్తుంది నిను చూస్తుంటే.. అకీరా ఫొటోలతో యూట్యూబర్ కవర్ సాంగ్