Rajinikanth: కూలీ తర్వాత రజనీ సినిమా ఏదంటే...
ABN, Publish Date - Jul 15 , 2025 | 10:39 AM
కూలీ తర్వాత రజనీకాంత్ నటించబోయే సినిమాపై క్లారిటీ వచ్చింది. మహరాజ చిత్ర దర్శకుడితో రజనీకాంత్ మూవీ చేయబోతున్నారట.
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) తదుపరి చిత్రంపై కొంత క్లారిటీ వచ్చింది. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ దీనిని నిర్మించబోతోంది. ఈ సినిమా దర్శకుడు మరెవరో కాదు... విజయ్ సేతుపతితో సూపర్ డూపర్ హిట్ చిత్రం 'మహరాజ'ను తెరకెక్కించిన నిథిలన్ సామినాథన్. 'మహరాజ' (Maharaja) మూవీ విడుదలైన తర్వాత దాని స్క్రీన్ ప్లే కు కేవలం కోలీవుడ్ మాత్రమే కాదు... అన్ని చిత్రసీమలు ఫిదా అయిపోయాయి. నిథిలన్ తో సినిమా చేయాలని అగ్ర కథానాయకులు సైతం ఆసక్తి చూపారు. పలువురు స్టార్ హీరోలు అతన్ని స్వయంగా పిలిచి, కలిసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో నిథిలన్ కొందరికి కథలు కూడా చెప్పాడని తెలిసింది.
రజనీకాంత్ 'కూలీ' (Coolie) సినిమా ఆగస్ట్ 14న విడుదల కాబోతోంది. దాని తర్వాత హెచ్. వినోద్, వివేక్ ఆత్రేయ చిత్రాలను రజనీకాంత్ చేయబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. వీరిద్దరూ రజనీకాంత్ కు కథలను వినిపించారట కూడా. అయితే... వీరి కథలను పక్కన పెట్టిన రజనీకాంత్ నిథిలన్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం అతి త్వరలోనే వస్తుందని తెలుస్తోంది.
Also Read: Do Bigha Zamin: పాత చిత్రాలకు కొత్త నగిషీలు
Also Read: Tuesday Tv Movies: మంగళవారం, జూలై 15.. తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే