Bullettu Bandi: బుల్లెట్ బండి టీజర్.. లారెన్స్ అన్నాదమ్ములు అదరగొట్టారుగా
ABN , Publish Date - Aug 08 , 2025 | 11:15 AM
రాఘవ లారెన్స్, ఆయన తమ్ముడు ఎల్విన్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన చిత్రం బుల్లెట్ బండి.
ట్యాలెంట్ పవర్ హౌస్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence), ఆయన తమ్ముడు ఎల్విన్ (Elviin)లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన చిత్రం బుల్లెట్ బండి (Bullettu Bandi). మిస్టరీ, క్రైమ్, యాక్షన్ అడ్వంచర్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ మూవీని తమిళ చిత్రం ‘డైరీ’ ఫేం డైరెక్టర్ ఇన్నాసి పాండియన్ (Innasi Pandiyan) దర్శకత్తవం వహించగా ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్‌పై కతిరేసన్ (Kathiresan) నిర్మించాడు. తెలుగమ్మాయి వైశాలి రాజ్ (Vaishali Raj) కథానాయికగా చేసింది. తాజాగా ఈ మూవీ మేకర్స్ చిన్న అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు.
టీజర్ చూస్తుంటే.. గ్యాప్ ఇవ్వకుండా ఫస్ట్ షాట్ నుంచే సినిమాలోకి తీసుకెళ్లేలా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు ఎక్ట్రార్డినరీగా ఉన్నాయి. ముఖ్యంగా శ్యామ్ సీఎస్ (Sam CS) బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరో లెవల్‌లో ఉండి టీజర్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. గతేడాది జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమాతో మంచి విజయం, అంతకు మించి పేరు తన ఖాతాలో వేసుకున్న లారెన్స్ ఈ చిత్రంతోనూ మంచి హిట్ కొడతాడని గ్యారెంటీగా అనిపిస్తోంది.
ఇదిలాఉంటే రియల్ స్టార్, స్వర్గీయ శ్రీహరి సతీమణి డిస్కోశాంతి చాలాకాలం తర్వాత ఈ మూవీతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. అలాగే టాలీవుడ్ కమెడియన్ సునీల్ కీ రోల్ చేస్తున్నాడు. కానీ అతని డబ్బింగ్ తేడా అనిపిస్తోంది.