Anupama Parameswaran: ఇక్కడ 'పరదా', అక్కడ 'జానకీ...'
ABN , Publish Date - Aug 22 , 2025 | 11:51 AM
అనుపమా పరమేశ్వరన్ నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీస్ రెండు ఒకే రోజున వేర్వేరు ప్లాట్ ఫామ్ లో సందడి చేస్తున్నాయి. 'పరదా' సినిమా థియేటర్లలో శుక్రవారం విడుదల కాగా. అదే రోజు నుండి 'జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' సినిమా తెలుగులో జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది.
మలయాళీ భామ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) కు తెలుగులోనూ బాగానే అభిమానులు ఉన్నారు. 'టిల్లు స్క్వేర్' మూవీతో గ్లామర్ పాత్రలకూ తాను సిద్థమని చెప్పిన అనుపమా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయడానికి ఆసక్తి చూపుతోంది. అలా రూపుదిద్దుకున్న సినిమానే 'పరదా' (Parada). శుక్రవారం ఈ సినిమా విడుదలైంది. విశేషం ఏమంటే... ఇదే రోజున అనుపమా పరమేశ్వరన్ మలయాళంలో చేసిన 'జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' సినిమా తెలుగులో జీ 5 ద్వారా స్ట్రీమింగ్ అవుతోంది. ఆ రకంగా ఇటు థియేటర్లలో, అటు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అనుపమా పరమేశ్వరన్ సినిమాలు చూసే అవకాశం ఆమె అభిమానులకు దక్కింది. నిజంగా ఇది డబుల్ థమాకానే!
'సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam), రాబిన్‌హుడ్ (Robinhood), భైరవం (Bhairavam)' వంటి వరుస తెలుగు చిత్రాలను అందించిన తర్వాత జీ 5 తెలుగు ఇప్పుడు మరో థాట్ ప్రవోకింగ్ మూవీని స్ట్రీమింగ్ చేసింది. విమర్శకుల ప్రశంసలు పొందిన మాలీవుడ్ లీగల్ కోర్ట్ డ్రామా ‘జె.ఎస్.కె.' - ' జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ (J.S.K – Janaki V/s State of Kerala) ఆగస్టు 22 నుండి తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో సక్సెస్ ఫుల్ గా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.
సురేష్ గోపి (Suresh Gopi), అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'జె.ఎస్.కె.' మూవీకి ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించగా, కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జె. ఫణీంద్ర కుమార్ నిర్మించారు. ప్రఖ్యాత న్యాయవాది డేవిడ్ అబెల్ డోనోవన్ (సురేష్ గోపి) సహాయంతో లైంగిక వేధింపుల నుండి బయటపడిన జానకి విద్యాధరన్ (అనుపమ పరమేశ్వరన్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. న్యాయం కోసం పోరాడుతున్న ఓ యువతి, న్యాయవాది చివరకు గెలిచారా? లేదా? అసలు జానకి జీవితంలో ఏం జరిగింది? న్యాయం కోసం చేయాల్సి వచ్చిన పోరాటం ఏంటి? అనే ప్రశ్నల్ని లేవనెత్తేలా ట్రైలర్‌ను కట్ చేశారు.
ఈ చిత్రంలో గిరీష్ నారాయణన్ స్వరపరిచిన పాటలు, గిబ్రాన్ అద్భుతమైన నేపథ్య సంగీతం స్పెషల్ అట్రాక్షన్ నిలిచాయి. ఈ చిత్రానికి రెనదివే సినిమాటోగ్రఫీ అందించారు. ఈ వీకెండ్ ను ఈ కోర్ట్ డ్రామా చూసి ఎంజాయ్ చేయవచ్చని జీ5 తెలుగు ప్రతినిధులు చెబుతున్నారు.
Also Read: Kannappa: వంద కోట్లతో మంచు విష్ణు మైక్రో డ్రామాస్
Also Read: Allu Arjun: వన్ అండ్ వన్ ఓన్లీ.. మెగాస్టార్! చిరంజీవికి.. బర్త్‌డే విషెస్ చెప్పిన అల్లు అర్జున్