Parada: అనుపమ కొత్త జానరే ప్లాన్ చేసింది!

ABN , Publish Date - Apr 26 , 2024 | 07:59 PM

దర్శక ద్వయం రాజ్‌ అండ్‌ డీకే నిర్మించిన ‘సినిమా బండి’తో ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్‌ కాండ్రేగుల తన రెండో చిత్రానికి సెట్స్‌పైకి తీసుకెళ్తున్నారు. మహిళా కథానాయకుల చుట్టూ కేంద్రీకృతమైన కథాంశంతో ఓ చిత్రాని తెరకెక్కించనున్నారు.

Parada: అనుపమ కొత్త జానరే ప్లాన్ చేసింది!

దర్శక ద్వయం రాజ్‌ అండ్‌ డీకే (Raj and Dk)నిర్మించిన ‘సినిమా బండి’తో (Cinema Bandi) ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్‌ కాండ్రేగుల (Praveen Kandegula) తన రెండో చిత్రానికి సెట్స్‌పైకి తీసుకెళ్తున్నారు. మహిళా కథానాయకుల చుట్టూ కేంద్రీకృతమైన కథాంశంతో ఓ చిత్రాని తెరకెక్కించనున్నారు. అనుపమ పరమేశ్వరన్‌, వెర్సటైల్‌ దర్శనా రాజేంద్రన్‌, ప్రముఖ నటి సంగీత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ‘పరదా’ (Parada)అనే ఆసక్తికరమైన టైటిల్‌ ఖరారు చేశారు. శీనివాసులు పివి, శ్రీధర్‌ మక్కువతో కలిసి విజయ్‌ డొంకాడ నిర్మాతలుగా ఆనంద మీడియా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.  సమంత, రాజ్‌ అండ్‌ డీకే ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌, కాన్సెప్ట్‌ వీడియో లాంచ్ చేశారు .

ఫస్ట్‌ లుక్‌లో అనుపమ కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది. సంప్రదాయ దుస్తుల్లో, వోని తో ముఖాన్ని కప్పి ఉంచే మరికొందరు అమ్మాయిలతో పాటు నిలబడి కనిపిస్తుంది. అందులో అనుపమ తీక్షణంగా చూస్తోంది. ఆ లుక్‌ చూస్తుంటే డీ గ్లామర్‌గా అనిపిస్తోంది. అలాగే కాన్సెప్ట్‌ వీడియోలో విలేజ్‌ సెటప్‌లో దేవత విగ్రహాన్ని చూపుతుంది. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా, యత్రైతాస్తు న పూజ్యంతే సర్వస్తత్రఫల క్రియా, మనుస్మృతి లోని ప్రసిద్థ శ్లోకం వినబడుతుంది. దర్శన రాజేంద్రన ఈ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తోంది. ఢిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్‌, కొన్ని గ్రామాలలోని అద్భుతమైన ప్రదేశాలలో షూటింగ్‌ చేశారు. మేలో హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్‌ చేయనున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ, ‘‘పరదా’’తో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే కాకుండా లోతుగా ప్రతిధ్వనింపజేేస ఆకట్టుకునే కథనాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాము’’ అన్నారు. గోపీ సుందర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మృదుల్‌ సుజిత్‌ ేసన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 

Updated Date - Apr 26 , 2024 | 09:32 PM