Allu Arjun: వ‌న్ అండ్ వ‌న్ ఓన్లీ.. మెగాస్టార్‌! చిరంజీవికి.. బ‌ర్త్‌డే విషెస్ చెప్పిన అల్లు అర్జున్

ABN , Publish Date - Aug 22 , 2025 | 10:38 AM

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) జన్మదినాన్ని పురస్కరించుకుని సినీ పరిశ్రమ అంతటా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

allu arjun

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) జన్మదినాన్ని పురస్కరించుకుని సినీ పరిశ్రమ అంతటా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కూడా తన అభిమానాన్ని, చిరంజీవిపై త‌న‌కున్న‌గౌరవాన్ని మరోసారి చాటుకున్నారు. సోషల్ మీడియాలో చిరంజీవితో కలిసి ఉన్న ఓ ఫోటోను పంచుకుంటూ, “Happy Birthday to our one and only Mega Star Chiranjeevi garu” అని రాసి తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.

allu arjun

ఈ పోస్ట్ ప్రస్తుతం సోష‌ల్ మీడియా, మెగా అభిమానులలో వైరల్ అవుతోంది. కుటుంబ వేడుకల్లో, పండుగలలో మెగా హీరోలు ఒక్కచోట కలిసినప్పుడు అభిమానులు త‌మ ఇంటే కార్యం జ‌రుగింద‌ని భావిస్తూ సంతోష ప‌డుతుంటారు. ఇప్పుడుచిరంజీవి విష‌యంలో అల్లు అర్జున్ చూపించిన అభిమానాన్ని మెగా ఫ్యాన్స్ ఫుల్‌ఎంజాయ్ చేస్తున్నారు. ఆ పోస్టును రీ ట్వీట్లు చేస్తున్నారు.

Updated Date - Aug 22 , 2025 | 10:39 AM