Kannappa: వంద కోట్లతో మంచు విష్ణు మైక్రో డ్రామాస్

ABN , Publish Date - Aug 22 , 2025 | 11:13 AM

మంచు విష్ణు కొత్త ప్రాజెక్ట్స్ కు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. దాదాపు వంద కోట్ల రూపాయల బడ్జెట్ తో విష్ణు మైక్రో డ్రామాస్ తీయబోతున్నాడని తెలుస్తోంది.

Manchu Vishnu

మంచు విష్ణు (Manchu Vishnu) పై ఉన్న నెగెటివిటీకి చెక్ పెట్టిన సినిమా 'కన్నప్ప' (Kannappa). ఆ సినిమా అఖండ విజయాన్ని సాధించకపోయినా... చూసిన వారంత విష్ణు నటనను మెచ్చుకున్నారు. మంచు ఫ్యామిలీ నుండి వచ్చిన సినిమాలలో ఇటీవల కాలంలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా ఇదే అంటే అతిశయోక్తి కాదు. అయితే 'కన్నప్ప' తర్వాత విష్ణు ఏ ప్రాజెక్ట్ చేపడతాడనే విషయానికి సంబంధించిన ఓ క్లారిటీ వచ్చింది.


విష్ణు ఇప్పుడు మైక్రో డ్రామాలపై వంద కోట్ల పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించుకున్నారని సమాచారం. ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసేందుకు విష్ణు మంచు ముందడుగు వేయబోతోన్నాడట. మైక్రో డ్రామాలతో విష్ణు మిరాకిల్స్ చేయబోతోన్నాడని అంటున్నారు. మూడు నుంచి ఏడు నిమిషాల వ్యవధితో సాగే ఎపిసోడ్స్‌ని మైక్రో డ్రామాలు అని చెప్పుకోవచ్చు. మొబైల్‌లో యూజర్స్‌కి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా వాటిని రూపొందించాలని విష్ణు నిర్ణయించుకున్నాడట. సాధారణ రీల్స్ మాదిరిగా కాకుండా, పూర్తి స్థాయి నిర్మాణం, ప్రొఫెషనల్ డైరెక్షన్, ఎఫెక్టివ్ స్టోరీ, నెరేషన్‌తో ఈ మైక్రో డ్రామాల్ని రూపొందించ నున్నారట. ఈ పరిణామం గురించి తెలిసిన పరిశ్రమ వర్గాలు ఈ కొత్త వెంచర్ భారతీయ వినోదంలో గేమ్ - ఛేంజింగ్‌గా మారుతుందని అంటున్నారు. అయితే ఇవే కాకుండా మరి కొన్ని భారీ బడ్జెట్ చిత్రాల్ని కూడా విష్ణు పట్టాలెక్కిస్తున్నారని సమాచారం.

Also Read: Allu Arjun: వ‌న్ అండ్ వ‌న్ ఓన్లీ.. మెగాస్టార్‌! చిరంజీవికి.. బ‌ర్త్‌డే విషెస్ చెప్పిన అల్లు అర్జున్

Also Read: Megastar Chiranjeevi: విశ్వంభర.. చిరంజీవి న‌యా లుక్‌! కుర్రాళ్ల‌కు పోటీ ఇచ్చేలా ఉన్నాడుగా

Updated Date - Aug 22 , 2025 | 11:13 AM