Kalyani Priyadarsan: 'లోక' సరికొత్త రికార్డ్...

ABN , Publish Date - Sep 03 , 2025 | 05:16 PM

కళ్యాణీ ప్రియదర్శన్ నటించిన మలయాళ చిత్రం 'లోక చాప్టర్ 1: చంద్ర' సరికొత్త రికార్డ్ ను సృష్టించింది. దక్షిణాదిలోనే అత్యధిక గ్రాస్ ను వసూలు చేసిన లేడీ ఓరియంటెడ్ మూవీగా ఇది అగ్రస్థానంలో నిలిచింది.

Lokah Chapter 1: Chandra

కంటెంట్ బేస్డ్ మూవీస్ కు ఇవాళ మలయాళ సినిమా రంగం కేరాఫ్ అడ్రస్ గా మారింది. రాజీ పడకుండా కాస్తంత భారీ ఖర్చు పెట్టి ఈ కంటెంట్ బేస్డ్ మూవీస్ ను నిర్మిస్తే, ఖచ్చితంగా ఇవి రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధించగలవని 'లోక చాప్టర్ 1: చంద్ర' సినిమా నిరూపించింది. ఈ లేడీ ఓరియంటెడ్ మూవీ సౌత్ లోనే కలెక్షన్స్ పరంగా అగ్రస్థానంలో నిలవడం విశేషం.


కళ్యాణీ ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) నటించిన 'లోక చాప్టర్ 1: చంద్ర' (Lokah Chapter 1: Chandra) ఓనమ్ కానుకగా మలయాళంలో ఆగస్ట్ 28న విడుదలైంది. రెండు రోజులు ఆలస్యంగా ఈ సినిమా 30వ తేదీ 'కొత్త లోక' పేరుతో తెలుగులో రిలీజ్ అయ్యింది. అలానే దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమాను నిర్మాత దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) రిలీజ్ చేశారు. విశేషం ఏమంటే... మలయాళంలో వచ్చిన తొలి లేడీ సూపర్ హీరో మూవీ ఇది. కళ్యాణీ ప్రియదర్శన్ కు కెరీర్ లోనే ఫస్ట్ ఇలాంటి పాత్ర దొరకడం అదృష్టమనే అంతా అనుకున్నారు. ఆమె కూడా ఎక్కడా రాజీ పడకుండా యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా చేసింది. అలానే ఈ సినిమాలో 'ప్రేమలు' ఫేమ్ నస్లీన్ (Naslan) కూడా కీలక పాత్ర పోషించడం ప్లస్ అయ్యింది. యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. చందమామను కథను తలపించేలా సినిమా ఉండటం, దానికి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ యాడ్ కావడంతో సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. ప్రథమార్ధంతో పోల్చితే ద్వితీయార్ధం కాస్తంత కంగాళీగా ఉందనే విమర్శలు వచ్చినా... దుల్కర్ సల్మాన్ నిర్మాణ విలువలకు ప్రాధాన్యం ఇవ్వడంతో 'లోకా చాప్టర్ 1: చంద్ర'కు కేరళలో మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఐదు భాగాలుగా తెరకెక్కబోతున్న ఈ సీరిస్ లో రెండో దానిలో టొవినో థామస్ హీరోగా నటించబోతున్నాడు. దానికి సంబంధించిన లీడ్ ను 'లోక చాప్టర్ 1: చంద్ర'లో చూపించారు.


చిత్రం ఏమంటే 'లోక చాప్టర్ 1: చంద్ర' సినిమా దక్షిణాదిలోనే లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. మహిళా ప్రధాన చిత్రాలు అనగానే తెలుగులో వచ్చిన 'రుద్రమదేవి (Rudhramadevi), మహానటి (Mahanati)' జనాలకు గుర్తొస్తాయి. ఇందులో 'రుద్రమదేవి' టోటల్ రన్ రూ. 80 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలానే అశ్వనీదత్ నిర్మించిన 'మహానటి' సినిమా టోటల్ రన్ లో రూ. 85 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. అయితే... ఇప్పుడు 'లోకా' చిత్రం మొదటి ఆరు రోజుల్లోనే రూ. 90 కోట్ల గ్రాస్ ను వరల్డ్ వైడ్ వసూలు చేసిందట. ఫస్ట్ వీక్ లో ఇది రూ. 100 కోట్లను క్రాస్ చేస్తుందని అంటున్నారు. దాదాపు రూ. 30 కోట్లతో తీసిన ఈ సినిమా దుల్కర్ సల్మాన్ కు బాగానే లాభాలు తెచ్చిపెడుతోంది.

ఇప్పుడీ 'లోకా' హిందీ డబ్బింగ్ వర్షన్ సెప్టెంబర్ 4 నుండి ఉత్తరాదిన కూడా ప్రదర్శితం కానుంది. ఒకవేళ హిందీ వర్షన్ అక్కడి వారికి నచ్చితే... అవలీలగా ఈ సినిమా రూ. 200 కోట్ల క్లబ్ లో చేరిపోవడం ఖాయం. అయితే... సెప్టెంబర్ 5వ తేదీన అనుష్క నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ 'ఘాటీ' (Ghaati) విడుదల కాబోతోంది. ఈ సినిమాలో తమిళ నటుడు విక్రమ్ ప్రభు కీలక పాత్రను పోషించాడు. సో... 'లోకా' కలెక్షన్స్ ను 'ఘాటీ' క్రాస్ చేస్తుందేమో చూడాలి.

Also Read: Allu Sirish: హిట్ కోసం రూట్ మార్చిన అల్లు వారబ్బాయి

Also Read: Balakrishna: థమన్ కు కలిసొచ్చిన నిర్ణయం

Updated Date - Sep 03 , 2025 | 05:16 PM

Lokah Chapter 1 Chandra: క‌ల్యాణి, న‌స్లేన్‌.. 'లోకా' జంట అదిరింది

Lokah Chapter 1 Chandra: క‌ల్యాణి, న‌స్లేన్‌.. 'లోకా' ట్రైల‌ర్ చూశారా! పెద్ద‌గానే ఫ్లాన్ చేశారుగా

Lokah: టోవినో థామస్ భుజాలపై 'లోకా -2' బాధ్యత

Lokah: సూప‌ర్ హీరోగా.. మ‌ల‌యాళ బ్యూటీ! లోకా టీజ‌ర్‌