Lokesh Kanagaraj: నాగార్జునను ఒప్పించడమే కష్టమైంది..
ABN, Publish Date - Jul 15 , 2025 | 04:24 PM
ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో కూలీ (Coolie) ఒకటి. సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కూలీ. సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 14 న రిలీజ్ కు రెడీ అవుతోంది.
Lokesh Kanagaraj: ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో కూలీ (Coolie) ఒకటి. సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కూలీ. సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 14 న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శృతి హాసన్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. కింగ్ నాగార్జున (King Nagarjuna) విలన్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక ఈ మధ్య రిలీజ్ అయిన మోనికా సాంగ్ ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూజా హెగ్డే ను కూడా డామినేట్ చేసేలా సౌబిన్ డ్యాన్స్ ఉండడంతో అభిమానులు ఆయన ఎనర్జీకి ఫిదా అవుతున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గరఅపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ .. వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో లోకేష్ కూలీ సినిమా విశేషాలను అభిమానులతో పంచుకున్నాడు. ముఖ్యంగా అక్కినేని నాగార్జున మెయిన్ విలన్ అన్న విషయాన్నీ రివీల్ చేశాడు.
మొదటి నుంచి కూడా నాగ్ నెగెటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రను చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. కానీ, అది కేవలం నెగెటివ్ షేడ్స్ నా ..? లేక క్యామియోనా అన్న విషయంలో క్లారిటీ లేదు. తాజాగా లోకేష్ ఆ క్లారిటీ ఇచ్చేశాడు. ఈ సినిమా కోసం రజినీకాంత్ ను ఒప్పించడం కన్నా నాగార్జున ఒప్పించడమే చాలా కష్టమైందని లోకేష్ చెప్పుకొచ్చాడు. ' ఒకసారి నాగ్ సార్ నన్ను ఒక మాట అడగరు. కూలీ కథను ఏం చెప్పి రజినీసార్ ను ఒప్పించారు అని. అప్పుడు నేను అన్నాను. ఆయనను ఒప్పించడం ఈజీ. మిమ్మల్ని ఒప్పించడమే చాలా కష్టం అనుకున్నాను అని చెప్పాను. ఎందుకంటే ఆయన ఈ సినిమాలో మెయిన్ విలన్. ఇప్పటివరకు ఆయన ఇలాంటి పాత్ర చేయలేదు. 40 ఏళ్ల కెరీర్ లో నేనెప్పుడూ కూడా ఇలా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడలేదని నాగ్ సార్ చెప్పారు. మరి ఈ సినిమాను మీ కుటుంబంతో కలిసి చూస్తే వారి రియాక్షన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అని అడిగితే.. ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్నాను అని అన్నారు' అంటూ చెప్పుకొచ్చాడు.
నాగార్జున చెప్పిన మాట వాస్తవమే. ఇన్నేళ్ల కెరీర్ లో నాగ సినిమాల్లో ఎలాంటి బూతులు దొర్లలేదు. పరాజయాల ద్వారా, వివాదాలకిద్వారా ట్రోల్ అయ్యాడేమో కానీ, ఇలాంటి విషయాల్లో నాగ్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. అలాంటిది మొదటిసారి విలన్ గా చేయడమే కాకుండా బూతులు కూడా మాట్లాడాడు అంటే సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. మరి ఈ సినిమా నాగ్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Ntr- Trivikram: తారక్ - త్రివిక్రమ్ మైథలాజికల్ మూవీ అప్‌డేట్ ఇదే
Chiranjeevi: అనారోగ్యంతో ఉన్న అభిమాని భార్య.. చిరు ఏం చేశారంటే..
Kuberaa song: శంకరా ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది