Chiranjeevi: అనారోగ్యంతో ఉన్న అభిమాని భార్య.. చిరు ఏం చేశారంటే..

ABN , Publish Date - Jul 15 , 2025 | 02:51 PM

చిరంజీవి వీరాభిమాని ఒకరు ఇటీవల ఆయన్ని కలిశారు. అతని పేరు కూడా చిరంజీవే. ఇంతకీ ఎందుకు కలిశారంటే 

Chiranjeevi

తనను ఎంతగానో అభిమానించే అభిమానుల కోసం చిరంజీవి (Chiranjeevi) ఎంతో చేస్తుంటారు. తాజాగా ఓ అభిమాని కోరిక తీర్చారు మెగాస్టార్‌. చిరంజీవి వీరాభిమాని ఒకరు ఇటీవల ఆయన్ని కలిశారు. అతని పేరు కూడా చిరంజీవే. సోషల్‌ మీడియా వేదికగా చిరంజీవి పాటలకు స్టెప్పులేస్తూ, ఆయన తరహాలోనే డైలాగ్‌లు చెబుతూ అలరిస్తుంటారు. ఈ వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. అయితే చిరంజీవిని కలవాలన్నది అన్నది తన కల. ఆయన భార్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె కూడా చిరంజీవి అభిమానే. ఆయనను ఎలాగైనా చిరంజీవిని కలవాలని ఆమె కోరుకుంది. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి వారిని ఇంటికి ఆహ్వానించారు. అనారోగ్యంతో ఉన్న అభిమాని భార్యతో (Chiranjeevi Fans) ఆప్యాయంగా మాట్లాడారు. 

ఆ అభిమాని చిరంజీవి ఫొటోతో గృహప్రదేశం చేసిన వీడియో చూసి చిరు భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె చిరంజీవి కాళ్ళకు దండం పెట్టబోతే వద్దని వారించారు చిరు. ఆయనను చూడాలనే తన భార్య కోరిక తీర్చిన చిరంజీవి కాళ్ల మీద పడ్డాడు ఆ అభిమాని. చిరు వాళ్లతో ఫొటో దిగి, కొత్త బట్టలు పెట్టి పంపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.  

ALSO READ: Kareena Kapoor Khan: ఇప్పటికీ నాజూగ్గా.. కరీనా డైట్‌ గురించి ఇదే..

Nidhhi Agerwal: హరిహర వీరమల్లు పార్ట్‌-2 అప్డేట్

Updated Date - Jul 15 , 2025 | 03:21 PM