Ntr- Trivikram: తారక్‌ - త్రివిక్రమ్‌ మైథలాజికల్‌ మూవీ అప్‌డేట్‌ ఇదే

ABN , Publish Date - Jul 15 , 2025 | 03:50 PM

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ పౌరాణిక చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే! దీనిపై తాజాగా నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR) హీరోగా త్రివిక్రమ్‌ (Trivikram) దర్శకత్వంలో ఓ పౌరాణిక చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే! సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ (Naga vamsi) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనిపై తాజాగా నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘వార్‌2’లో ఎన్టీఆర్‌ క్యారెక్టర్‌ గురించి గురించి కూడా చెప్పుకొచ్చారు.


‘మా బ్యానర్‌లో త్రివిక్రమ్‌- ఎన్టీఆర్‌ సినిమా ప్రకటించడానికి పెద్ద ప్లానే చేశాం. త్రివిక్రమ్‌ చేస్తున్న మొదటి మైథలాజికల్‌ సినిమా ఇది. సీనియర్‌ ఎన్టీఆర్‌ను రాముడిగా, కృష్ణుడిగా చూశాం. ఇప్పుడు తారక్‌ను నేను అలా చూపించనున్నాను. ‘రామాయణ’ను ప్రకటించిన తర్వాత దేశమంతా దాని గురించి మాట్లాడుకుంది. దానికంటే భారీగా మా సినిమాను ప్రకటించాలని కొన్ని రోజులు ఆపాం. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మధ్యలో దీన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. అలాగే త్రివిక్రమ్‌ - వెంకటేశ్‌ సినిమా ఆగస్టు నుంచి ప్రారంభం అవుతుంది. ఇది పూర్తయిన తర్వాత తారక్‌ సినిమా పనులు మొదలుపెడతాం’ అని అన్నారు.    

‘వార్‌ 2’ గురించి చెబుతూ ‘ఇందులో ఎన్టీఆర్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. ఎన్టీఆర్‌ - హృతిక్‌ల ఫైటింగ్‌ సీన్‌ అది. అభిమానులు పండగ చేసుకునేలా ఉంటుంది.  ఆ ఒక్క సీన్‌ చూసే నేను ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేయాలని డిసైడ్‌ అయ్యాను. ఇద్దరు అగ్ర హీరోలు పోటీగా తలపడితే ఎలా ఉంటుందో ప్రేక్షకుల ఊహకే వదిలేస్తున్నా.  సినిమా అంతా ఇద్దరు కనిపిస్తారు. ఎన్టీఆర్‌ కేవలం కొన్ని నిమిషాలకే పరిమితం అనేది రూమర్స్‌ మాత్రమే. ఇద్దరికీ ఈక్వల్‌ క్యారెక్టర్ ఇచ్చారు దర్శకుడు అయాన్‌ ముఖర్జీ' అని నాగవంశీ చెప్పారు.

Also Read: Mahesh Bhatt about Mohit suri Saiyaara : ‘ఆషికి’ రోజుల్ని తలుచుకోవడం ఆనందం
 

Also Read: Yellamma: ఎల్ల‌మ్మ‌కు.. త‌మ్ముడి దెబ్బ‌

Updated Date - Jul 15 , 2025 | 05:05 PM