సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kantara chapter 1: ఇది కేవలం సినిమా కాదు. ఇదొక శక్తి..

ABN, Publish Date - Jul 21 , 2025 | 04:05 PM

ప్రతిరోజు వేలమంది సెట్లో చూస్తున్నప్పుడు నన్ను వెంటాడుతున్న విషయం ఒక్కటే.. ఇది కేవలం సినిమా కాదు. ఇదొక శక్తి.. కాంతార ప్రపంచానికి మీ అందరికీ స్వాగతం’ అని రిషబ్‌ తన మాటల్లో కాంతారా జర్నీ చెప్పుకొచ్చారు.

కన్నడ నటుడు రిషబ్‌ శెట్టి (Rishab Shetty) నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'కాంతార ఛాప్టర్‌-1’ (Kantara chapter-1). ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా ఈ సినిమా వస్తోంది. సడెన్‌గా చిత్ర బృందం సినీ ప్రియులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ‘కాంతార జర్నీ’ అంటూ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇది కేవలం ఒక సినిమా కాదు.. ఒక శక్తి అంటూ రిషబ్‌ తన జర్నీని తెలిపారు. ఇందులో సినిమా విడుదల తేదీని వెల్లడించారు. అక్టోబర్‌ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చెప్పారు. ఇటీవల రిషబ్‌ శెట్టి పుట్టినరోజు సందర్భంగా ‘కాంతార చాప్టర్‌ 1’ నుంచి మేకర్స్‌ ఓ పవర్‌ఫుల్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో కవచంతో యుద్థం చేస్తున్న రిషబ్‌ శెట్టి పోస్టర్‌లో కనిపించి అలరించాడు.

మూడేళ్ల కఠోర శ్రమ.. 250 రోజుల చిత్రీకరణ
తాజాగా విడుదల చేసిన గ్లింప్స్‌లో ‘‘నాదొక కల.. మన మట్టి కథను మొత్తం ప్రపంచానికి చెప్పాలని! మన ఊరు, మన జనం, మన నమ్మకాలు,. నేను ఈ కథను చెప్పడానికి ముందుకెళ్లినప్పుడు వేల మంది నా వెంట వచ్చారు. మూడేళ్ల కఠోర శ్రమ.. 250 రోజుల చిత్రీకరణ.. ఎంత కష్టమొచ్చినా నేను నమ్ముకున్న దైవం నా చెయ్యి వదల్లేదు. మా మొత్తం బృందం, మా నిర్మాత నా వెన్నంటే ఉన్నారు. ప్రతిరోజు వేలమంది సెట్లో చూస్తున్నప్పుడు నన్ను వెంటాడుతున్న విషయం ఒక్కటే.. ఇది కేవలం సినిమా కాదు. ఇదొక శక్తి.. కాంతార ప్రపంచానికి మీ అందరికీ స్వాగతం’ అని రిషబ్‌ తన మాటల్లో కాంతారా జర్నీ చెప్పుకొచ్చారు.


ఇందులో సినిమా సెట్స్‌కి సంబంధించిన స్కెచ్‌లు, గ్రామీణ నేపథ్యంలో ఇళ్ల సెట్లు, పోరాట ఘట్టాలు, షూట్‌ ప్లానింగ్‌ ఇలా కాంతార జర్నీ మొత్తాన్ని చూపించారు. ఈ సినిమాకు అంతర్జాతీయ నిపుణులు పని చేశారు. 500 మంది ఫైటర్లు, 3000 మంది జూనియర్‌ ఆర్టిస్టులతో తీసిన యుద్థ ఘట్టం భారతీయ సినిమా చరిత్రలోనే ఓ రికార్డ్‌గా నిలవబోతోందని మేకర్స్‌ తెలియజేశారు. హోంబలే ఫిల్మ్స్‌ ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మిస్తోంది.   అజనీస్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన గ్లింప్స్‌లో సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని చూపించారు. ప్రస్తుతం ఈ వ్రాపప్‌ గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.


ALSO READ:

Pawan Raashii combo: పవన్‌కు జోడీగా

Pawan kalyan Press meet: రత్నంగారు నలిగిపోవడం చూడలేక.. పవన్‌ ప్రెస్‌మీట్‌

Kantara surprise glimpse: గ్లింప్స్‌ తో సర్‌ప్రైజ్‌ చేసిన రిషబ్ శెట్టి

Pawan Kalyan: ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా ఎ.ఎం.రత్నం!

Updated Date - Jul 21 , 2025 | 04:11 PM